scham
-
నందూస్ వరల్డ్ వీసా స్కామ్‌లో బిగ్ ట్విస్ట్?!
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ ‘నందూస్ వరల్డ్’(Nandu's World) దంపతులైన మధుకర్ జాగర్లమూడి, రమా నందన వీసా స్కామ్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులు, ఒకరో ఇద్దరు కాదని వందల్లో ఉండొచ్చనే వాదనలు తెరపైకి వచ్చాయి. నందూస్ వరల్డ్ వీసా స్కామ్‌లో ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా, ఇద్దరు దంపతులు డెస్టినీ వీసా కన్సల్టెన్సీ పేరుతో వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని తమ వద్దనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్ యూట్యూబ్‌లో ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్ అయ్యారు. లక్షల మంది అభిమానుల్ని సంపాదించారు. విదేశాల్లో సెటిలై సక్సెస్ స్టోరీగా నిలిచారు. ఇప్పుడా కపుల్స్ చుట్టూ కోట్ల రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. యూకే వీసా ఇప్పిస్తాం అంటూ లక్షలు వసూలు చేశారా?. బాధితుల డబ్బు తీసుకుని బ్లాక్ చేశారా?. వైరల్ అవుతున్న వీడియోలు,కేసులు,కౌంటర్ ఆరోపణల మధ్య నందూస్ వరల్డ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. అసలు ఈ వివాదం వెనుక కథేంటీ?.సోషల్ మీడియాలో నందు వరల్డ్‌తో ఫేమస్‌యిన రమానందన, జాగర్లముడి మధుకర్ దంపతులు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. యూట్యూబ్‌లో కుటుంబ కథలు, ఫన్నీ వీడియోలు, విదేశీ జీవన శైలిని చూపిస్తూ లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ జంట ఇప్పుడు యూకే వీసా మోసం ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.👉ఇదీ చదవండి : నందూస్ వరల్డ్ దంపతులపై కేసుస్కామ్ విలువ రూ.10 కోట్ల నుంచి 20 కోట్లు? బాధితుల ప్రకారం.. యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అత్యంత కీలకంగా వీరి యూట్యూబ్‌ను చూసి చాలా మంది వారిని నమ్మినట్లు బాధితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లా నమ్మి లక్షలు ఇచ్చామని, కానీ తర్వాత తమకు అనుమానాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడానికి కారణం ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన క్రాంతి కుమార్ ఫిర్యాదు. యూకే వీసా రెన్యువల్ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వివాదాన్ని మరింత పెంచాయి. డబ్బులు తిరిగి అడిగిన బాధితులతో మధుకర్ పొగరుగా మాట్లాడినట్లు కొన్ని సందర్భాలలో బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సమాధానం ఇస్తామా?’ అన్న వ్యాఖ్యలు వైరల్ కావడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఆరోపణల్ని నందన పూర్తిగా ఖండిస్తున్నారు. తమపై వ్యక్తిగత కక్షతో ప్రచారం జరుగుతుందన్నారు. యూకే నుంచి ఇండియాకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కావాలనే తమపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని,యూకేలో చట్టబద్ధంగా నమోదైన సంస్థలే ఉన్నాయని నందన చెబుతున్నారు. వైరల్ అవుతున్న ఆడియోలు పూర్తిగా ఎడిట్ చేసినవేనని, అసలు సంభాషణలు వక్రీకరించారని ఆమె ఆరోపించారు. వీసా ప్రక్రియలో ఆలస్యం జరగడం సహజమని, ఎవరిని మోసం చేసే ఉద్దేశం తమకు లేదని వివరణిచ్చారు.మరోవైపు నందన తరుఫు న్యాయవాదులు సైతం కంపెనీలు యూకేలో చట్టబద్ధంగా నమోదయ్యాయని, వీసా మంజూరు చేయడం పూర్తిగా యూకే ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని వాదిస్తున్నారు. కానీ బాధితులు మాత్రం తాము డబ్బులు ఇచ్చినట్లుగా రసీదులు, ఆడియోలు, బ్యాంకు ట్రాన్సాక్షన్‌ని సాక్షాలుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు అసలు నిజం ఏంటన్నది దర్యాప్తు తేలాల్సి ఉంది.బాధితుల కన్నీళ్లు.. నందన దంపతుల కుట్ర ఆరోపణలుఒకప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్ సింబల్‌గా కనిపించిన ఈ జంట.. ఇప్పుడ కోట్లాది రూపాయల వీసా స్కామ్ కేంద్రంగా మారింది. ఓ వైపు బాధితుల కన్నీళ్లు.. మరోవైపు నందన దంపతుల కుట్ర ఆరోపణలతో సోషల్ మీడియా నిండిపోయింది. వైరల్ ఆడియోలు, కేసులు దర్యాప్తు ఇప్పుడు ఈ కేసును మరింత వైరల్ చేశాయి. సోషల్ మీడియా స్టార్డమ్ నుంచి క్రిమినల్ కంప్లయింట్ల వరకు వచ్చిన ఈ వ్యవహారంలో చివరకు నిజం ఎవరివైపు ఉందో తేలాల్సి ఉంది. అప్పటి వరకు నందూస్ వరల్డ్ వ్యవహారం సోషల్ మీడియా నుంచి పోలీస్ స్టేషన్ వరకు హాట్టాపిగ్గా కొనసాగేలా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఇద్దరు దంపతుల్ని హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన అమ్మ,భార్య బంగారంతో పాటు కారును అమ్మి యూకే వీసా కోసం ప్రయత్నం చేశామని, ఇందుకోసం మధుకర్‌కు ప్రస్తుత యూకే కరెన్సీ విలువ ప్రకారం రూ.18లక్షలు చెల్లించినట్లు బాధిత దంపతులు మీడియా ఎదుట వాపోయారు. స్పాన్సర్ షిప్ వీసాతో యూకేకి వెళ్లిన తాము పడరాన్ని పడినట్లు తెలిపారు. తమను నమ్మించి పదే పదే ఫేక్ స్పాన్సర్ షిప్ విధించడంతో యూకే ప్రభుత్వం తమను పదేళ్ల పాటు బ్యాన్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.యూట్యూబ్‌లో తమకు వస్తున్న ఫేమ్‌ను తట్టుకోలేక పలువురు విష ప్రచారం చేస్తున్నారని నందన వీడియోపై బాధిత దంపతులు స్పందించారు. నందన భర్త మధుకర్‌కు డబ్బులు పంపిన సస్కక్రీన్ షార్ట్స్, మనీ ట్రాన్సాక్షన్ ఉన్నాయని తెలిపారు. తమ న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదని మీడియా ఎదుట వారి బాధను వెలిబుచ్చారు. -
ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలతో పాటు.. తప్పుడు వార్తల ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులకు ముందు ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్స్ సమయాల్లో మార్పు అంటూ ఒక న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరులు రోజుకు రూ. 10,000 వరకు సంపాదించడానికి వీలు కల్పించే ప్రాజెక్ట్‌ను ప్రారభించారనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ప్రధాని నరేంద్ర మోడీ తన కొత్త ప్రాజెక్టును ఆవిష్కరించిన తర్వాత ఏటీఎంల వద్ద పొడవైన క్యూలు ఏర్పడతాయని, దీని ద్వారా ప్రజలు రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చని, వేలమంది భారతీయులు ఇప్పటికే మొదటి నెలలో రూ. 80,000 నుంచి రూ. 3,50,000 వరకు సంపాదించారని ఒక తప్పుడు వార్త సంచలనం సృష్టించింది.ఇదీ చదవండి: పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపుదీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులు రోజుకు రూ. 10,000 వరకు సంపాదించడానికి వీలు కల్పించే ప్రాజెక్ట్‌ను ప్రారభించారనే వార్తలో ఎటువంటి నిజం లేదని, ప్రజలు దీనిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.🕵️♂️ #Fraudulent_Website_AlertA #FAKE website is falsely claiming that Prime Minister Narendra Modi has launched a project allowing citizens to earn up to ₹10,000 per day.🔍 #PIBFactCheck📣 The Government of India has NOT made any such announcement.⚠️ Be cautious! Do NOT… pic.twitter.com/Bf1Q4BhQPb— PIB Fact Check (@PIBFactCheck) May 15, 2025 -
కాల్ సెంటర్ స్కామ్ జరుగుతుందిలా! ఆదమరిస్తే..
Call Centre Scheme: రోజు రోజుకి ప్రపంచ వ్యాప్తంగా కాల్ సెంటర్ మోసాలు భారీగా జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి సంబంధిత శాఖలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మోసగాళ్లు కూడా ఎత్తుకి పైఎత్తు వేస్తున్నారు. ఇలాంటి సంఘటనలో గతంలో కోకొల్లలుగా జరిగాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ట్విటర్ ద్వారా వెల్లడైన వీడియోలో మీరు గమనించినట్లతే కాల్ సెంటర్ అందులో పని చేసే ఉద్యోగులు స్పష్టంగా కనిపిస్తారు. ఇందులో ఒక ఉద్యోగి 'చర్చిల్' అనే వ్యక్తికి ఫోన్ చేసి మీ వాషింగ్ మిషన్ వారంటీ ముగిసిందని, వారంటీ పొడిగించడానికి కాల్ చేస్తున్న అంటూ మాట్లాడుతుంది. నిజానికి ముందుగానే పక్కా ప్రణాళిక ప్రకారం ఈ మోసాలు జరుగుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. Making Life HELL For Scammers pic.twitter.com/hhPJ50EYVG — Insane Reality Leaks (@InsaneRealitys) June 28, 2023 కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులలో ఒక వ్యక్తి ల్యాప్ టాప్ ముందు ఉన్నట్లు, పక్కన ఉన్న మరో వ్యక్తి డ్యూయెల్ మానిటర్ సెటప్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా వీరే ఆ కాల్ సెంటర్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. వారు ముందుగానే కొంతమందిని సెలక్ట్ చేసుకుని వారికి ఫోన్స్ చేస్తున్నట్లు కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇలాంటి మోసాలు జరగటం ఇదే మొదటి సారి కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి మోసాలు ఎక్కువైపోతున్నాయి. కొంత మంది వందల కోట్లు ఈ కాల్ సెంటర్ల ద్వారా స్కామ్ చేస్తున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి మీకు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే వారంటీలు, ఇతరత్రా కారణాలు చెప్పి మభ్య పెట్టాలని చూస్తే వాటికి స్పందించకపోవడం మంచిది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులకు పిర్యాదు చేయవచ్చు. -
పాఠశాలల్లో వసతులపై మే నుంచి తనిఖీలు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు చేపట్టేందుకు ఈ ఏడాది మే నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ చెప్పారు. బాలల హక్కులను పరిరక్షించే అంశంపై న్యాయసేవా సదన్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల నిర్వహణకు అనుమతులిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు, పుస్తకాల రూపంలో దోపిడీ చేస్తే సహించేది లేదన్నారు. విద్యార్థులకు తగిన నిష్పత్తిలో మరుగుదొడ్లు, క్రీడామైదానం, రెండు అంతస్తులకు మించిన భవనాల్లో స్కూళ్లు నడపకుండా చూడటం, అన్ని అంతస్తుల్లో తాగునీటి సౌకర్యం, అగ్నిప్రమాదాల నుంచి రక్షణకు చర్యలు తదితర ప్రభుత్వ నిబంధనలు పాటించిన స్కూళ్లకు మాత్రమే అనుమతులివ్వాలన్నారు. లేని వసతులు ఉన్నట్లు రికార్డుల్లో చూపించి, అనుమతిస్తే అందుకు అధికారులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ అంశాలపై తల్లిదండ్రులు, ఇంకెవరైనా అన్యాయం జరుగుతోందని భావిస్తే వారికి తెలిసిన న్యాయవాది లేదా జిల్లా న్యాయసేవా సంస్థ ద్వారా తమను సంప్రదించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లకుండానే హాజరైనట్లు చూపిస్తున్నారని, అటువంటి వారిపై భవిష్యత్‌లో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. డీఆర్వో ఆర్.రాజ్‌కుమార్, ఏఎస్పీ ఏ.వి.రమణ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ భువనగిరి కృష్ణవేణి, డీఈఓ నాగమణి, ఫ్యామిలీ కోర్టు జడ్జి భీమారావు, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏమార్చే యత్నం !
సాక్షిప్రతినిధి, అనంతపురం: ఎరువుల కుంభకోణంలో సూత్రదారులైన ఇద్దరు అధికారులను తప్పించేలా విచారణ సాగుతోందా..? వ్యవసాయాధికారులతో పాటు మిక్సింగ్‌ప్లాంటుపై ఎలాంటి చర్యలు లేకుండా చూడాలని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి చేసిన ఆదేశాలను విచారణ అధికారులు పాటిస్తున్నారా...? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎరువుల కుంభకోణంలో మార్క్‌ఫెడ్‌కు వెళ్లాల్సిన 50 శాతం ఎరువులు భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు వెళ్లినట్లు తేలింది. ఈ ఎరువులను అధికారులు సీజ్ చేశారు. వాస్తవానికి కలెక్టర్, జేడీ, ఏడీ పీపీ కనుసన్నల్లో ఎరువుల కేటాయింపులు జరగాలి. ‘సాక్షి’లో కథనాలు వచ్చే వరకూ భాస్కర్‌ఫర్టిలైజర్స్ వైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. దీన్నిబట్టే అధికారుల ప్రమేయంతోనే ఎరువులు ప్లాంటుకు చేరినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదిన వచ్చిన రేక్‌లోని ఎరువులను కూడా ప్లాంటుకు తరలించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ‘సాక్షి’లో ‘దారితప్పిన ఎరువులు’ శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో అదేరోజు మధ్యాహ్నం లోపు ఎరువులను ‘సెంట్రల్‌వేర్‌హౌస్’ గోడౌన్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలన్నీ బట్టి చూస్తే వ్యవసాయధికారులే 1,300 టన్నుల ఎరువులను దారి మళ్లించారని తెలుస్తోంది. ఈ ఘటనకు ఎరువుల పర్యవేక్షణ చూసే అధికారులు బాధ్యత వహించాలి. అయితే వీరిని తప్పించేందుకు ఇప్పుడు కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ‘మార్క్‌ఫెడ్’ అధికారులు వద్దన్నారు కాబట్టే ఎరువులు ప్లాంటుకు పంపామని కథ అల్లుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మార్క్‌ఫెడ్‌తో పాటు, రేక్ ఆఫీసర్ పాత్రను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి రేక్ ఆఫీసర్ అనే పోస్టు లేదు. లోకల్ ఏఓ లేదా ఏడీని నామినేట్ చేయాలి. ప్రస్తుతం ఏఓగా వాసుప్రకాశ్, రవి ఏడీఏగా ఏడాదిన్నరగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవ్వరినీ రేక్ ఆఫీసర్‌గా నామినేట్ చేయలేదు. ఎరువులను జేడీఏ కార్యాలయ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. అంటే వేల టన్నుల ఎరువులు రైల్వేస్టేçÙన్కు వస్తుంటే అవి ఎవరికి పంపాలి..? కేటాయింపులు ఎవరు చూడాలి..? బాధ్యత ఎవరిదనేది లే కుండా ఇంత కాలం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు కేటాయింపులు కీలక అధికారుల కనుసన్నల్లో జరగడం, విషయం బయటకు పొక్కడంతో బాధ్యులని తప్పించేందుకు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది. కలెక్టర్ నిస్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.


