టీవీఎస్‌ కొత్త ఈవీ త్రీవీలర్‌.. ధర ఎంతంటే.. | TVS launched its TVS King EV Max an electric three wheeler | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌ కొత్త ఈవీ త్రీవీలర్‌.. ధర ఎంతంటే..

May 21 2025 1:29 PM | Updated on May 21 2025 1:42 PM

TVS launched its TVS King EV Max an electric three wheeler

టీవీఎస్ మోటార్ కంపెనీ ‘కింగ్ ఈవీ మ్యాక్స్’ అనే ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను తమిళనాడులో లాంచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఈవీ త్రీవీలర్‌ ధర రూ.2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉందని చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని పేర్కొంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం వల్ల కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 80% ఛార్జ్‌ అవుతుంది.

టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఫీచర్లు

బ్యాటరీ: హై పెర్ఫార్మెన్స్ 51.2వోల్ట్‌ లిథియం-అయాన్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ.

గరిష్ట వేగం: 60 కి.మీ/గం గరిష్ఠ వేగంతో మూడు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. ఎకో (40 కి.మీ/గం), సిటీ (50 కి.మీ/గం), పవర్ (60 కి.మీ/గం) వేగాన్ని కలిగి ఉంది.

ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!

స్మార్ట్ కనెక్టివిటీ: టీవీఎస్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్‌ స్మార్ట్‌ఫోన్ల ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వెహికల్ డయాగ్నస్టిక్స్ వివరాలు అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement