ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర! | Today gold and silver rates on Telugu states | Sakshi
Sakshi News home page

ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!

May 21 2025 11:25 AM | Updated on May 21 2025 11:31 AM

Today gold and silver rates on Telugu states

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్‌ సెషన్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,300 (22 క్యారెట్స్), రూ.97,420 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.2,200, రూ.2,400 పెరిగింది.

చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,400 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,420 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

ఇదీ చదవండి: మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,200 పెరిగి రూ.89,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,400 పెరిగి రూ.97,570 వద్దకు చేరింది.

వెండి ధరలు

బంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement