కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగి | Why Former Microsoft Executive Lathika Pai Filed Civil Suit | Sakshi
Sakshi News home page

కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగి

May 22 2025 10:56 AM | Updated on May 22 2025 11:10 AM

Why Former Microsoft Executive Lathika Pai Filed Civil Suit

పని ప్రదేశంలో ప్రతికూల వాతావరణం కారణంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతికా పాయ్  ఆరోపిస్తూ కంపెనీపై సివిల్ దావా వేశారు. రూ.35.3 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనను ఉద్దేశపూర్వకంగా రాజీనామా చేయించారని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు మే 7న ఈ కేసును విచారించి బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టుకు తరలించింది. దీనిపై జూన్ 9న బెంగళూరులో విచారణ జరగనుంది.

స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎక్స్‌పర్ట్‌గా కంపెనీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాయ్‌ జులై 2024లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పార్ట్‌నర్స్‌ కంట్రీ హెడ్‌గా పాయ్‌ ఉన్నారు. తాను నాయకత్వం వహించిన ఫ్లాగ్‌షిప్‌ స్టార్టప్ ఇనిషియేటివ్ ‘హైవే టు ఏ 100 యూనికార్న్స్’పై గతంలో కంపెనీ అంతర్గత దర్యాప్తు నిర్వహించింది. తరువాత ఎనిమిది నెలలపాటు తనపై బెదిరింపులకు పాల్పడినట్లు పాయ్‌ ఆరోపించారు. 2019లో మైక్రోసాఫ్ట్ వెంచర్‌ క్యాపిటల్‌ వ్యవహారాల్లో పక్షపాతంగా ఉంటున్నారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు పాయ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. దాంతో దర్యాప్తు నిర్వహించి పాయ్ ఎలాంటి తప్పు చేయలేదని తేలడంతో 2021లో పదోన్నతి పొందారు.

ఇదీ చదవండి: ‘రూ.కోట్లున్నా మాకొద్దీ వ్యాపారం..’ మారుతున్న దృక్పథం

తర్వాత కొంత కాలానికి న్యాయ సంస్థ మోర్గాన్ లూయిస్ అండ్ బోకియస్ 2024 మార్చిలో రెండో దఫా దర్యాప్తును ప్రారంభించింది. అయితే మైక్రోసాఫ్ట్ విధానానికి విరుద్ధంగా 2024లో ఒక కీలక ఇంటర్వ్యూను రికార్డ్‌ చేయకుండా విచారణ నిర్వహించారని పాయ్ పేర్కొన్నారు. వీటిపై తన అభ్యంతరాలను కంపెనీ వ్యతిరేకించిందని చెప్పారు. ఆమెను కీలక పదవుల నుంచి తొలగించి ‘ట్రబుల్‌మేకర్‌’గా ముద్ర వేశారని తెలిపారు. 2020 సైబర్ బుల్లీయింగ్ కేసులో మైక్రోసాఫ్ట్ తగిన చర్యలు తీసుకోలేదని పాయ్ ఆరోపించారు. మైక్రోసాఫ్ట్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సహకారం సందేహాస్పదంగా ఉందని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement