Pressure Cooker: వీటిని అస్సలు కుక్‌ చేయెద్దు! | Dos and Don'ts: Don't cook these foods on Pressure Cooker | Sakshi
Sakshi News home page

Pressure Cooker: వీటిని అస్సలు కుక్‌ చేయెద్దు!

May 24 2025 3:09 PM | Updated on May 24 2025 3:21 PM

Dos and Don'ts: Don't cook these foods on Pressure Cooker

ప్రెజర్‌ కుకర్‌ ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. వంటకు ప్రెజర్‌ కుకర్‌ను ఉపయోగించని వారుండరు. అయితే ఈ ఐదు వస్తువులను ప్రెజర్‌ కుకర్‌లో ఎప్పుడూ ఉడికించకూడదని  పరిశోధకులు చెబుతున్నారు. 

పాలు మరిగించరాదు
 పాలు, క్రీమ్‌ వంటి పాల ఉత్పత్తులను ప్రెజర్‌ కుకర్‌లో అస్సలు వండకూడదు. ఇలా చేయడం వల్ల వాటి రుచి చెడిపోతుంది. పోషకాలు కూడా తగ్గుతాయి. ఇలా కుకర్‌లో కాచిన పాలు ఆరోగ్యానికి హాని కరం.పాలు వేడి చేయడం సులభం అయినా సరే కొంతమందిపాలను కుకర్‌లో వేడి చేస్తున్నారు. పైగాపాలను వేడి చేసేందుకు స్పెషల్‌ కుకర్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయినా సరే ఇలా వేడి చేసిన పాలు ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

ఇదీ చదవండి: ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్‌ నెం.1 లగ్జరీ కారు

వేయించిన పదార్థాలు
ఫ్రెంచ్‌ ఫ్రైస్, పకోడీలు వంటి వేయించాల్సిన ఆహార పదార్థాలను కుక్కర్‌లో వండకూడదు. వేయించిన వీటిని ప్రెజర్‌ కుకర్‌లో ఆవిరి మీద ఉడికిస్తే కరకరలాడే అనుభూతిని ఇవ్వదు. ఎందుకంటే వీటిని కుక్కర్‌లో డీప్‌ ఫ్రై  చేయలేరు.ఇలా చేయడం వల్ల వాటికి మంచి రుచి రాదు. అందుకే వీటిని ఎప్పుడూ కుకర్‌లో తయారు చేసుకోవద్దు. అంతేకాదు అధిక నూనెతో వంటలు చేయడం వలన పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. ఎందుకంటే కుకర్‌ సీల్, భద్రతా విధానాలు అధిక ఉష్ణోగ్రత ప్రతిచర్యలను తట్టుకోలేవు.

చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది

పాస్తా , నూడుల్స్‌ 
పాస్తా, నూడుల్స్‌ త్వరగా ఉడికించవచ్చు. ఇవి ఉడికిన తర్వాత మెత్తగా అవుతాయి. కనుక వీటిని ఎప్పుడూ ప్రెజర్‌ కుకర్‌లో ఉడికించకూడదు. అవి ఎక్కువగా ఉడికితే.. మెత్తం పేస్ట్‌లా మారతాయి. అందువల్ల వీటిని ప్రెజర్‌ కుకర్‌లో ఉడికించవద్దు.

ఆకుకూరలు
పాలకూర, కాలే వంటి ఆకుకూరలను కుకర్‌లో ఎప్పుడూ ఉడికించకూడదు. ఎందుకంటే ఆకుకూరల్లో విటమిన్‌ సి, ఐరన్, కాల్షియం, విటమిన్‌ ఎ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అయితే ప్రెజర్‌ కుకర్‌లో వీటిని ఉడికించడం వల్ల ముఖ్యమైన పోషక పదార్థాలు తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి హానికరం.

కేక్‌
ప్రెజర్‌ కుకర్‌లో కేక్‌ కాల్చడం సరైనది కాదు.  తరచుగా ప్రజలు ఓవెన్‌ లేకపోతే ప్రెషర్‌ కుక్కర్‌లో కేక్‌ని తయారు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం పూర్తిగా తప్పు ఎందుకంటే ప్రెషర్‌ కుకర్‌ అనేది వంట కోసం తయారు చేయబడింది. బేకింగ్‌ కోసం కాదు. కనుక కుకర్‌లో కేక్‌ ఎప్పుడూ కాల్చకూడదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement