
ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ యాజమాన్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్ లింక్ బంగ్లాదేశ్‌లో అధికారికంగా సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ డిజిటల్ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గణనీయమైన పురోగతిని సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్, నెట్‌వర్క్ సమస్యలతో పోరాడుతున్న మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలనే లక్ష్యంతో ఈ సర్వీసులు ప్రారంభించిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
స్టార్ లింక్ విభిన్న యూజర్ అవసరాలను తీర్చడానికి బంగ్లాదేశ్‌లో వివిధ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. స్టార్ లింక్ రెసిడెన్స్ ప్లాన్‌లో భాగంగా నెలకు 6,000 టాకా ధర(రూ.4,200)తో ప్రామాణిక గృహ వినియోగానికి ఇంటర్నెట్ అందిస్తున్నారు. రెసిడెన్సీ లైట్ ప్లాన్‌లో భాగంగా నెలకు 4,200 టాకా(రూ.2,900) ధరతో నెట్ సేవలు అందిస్తున్నారు. వన్ టైమ్ సెటప్ ఫీజు కింద 47,000 టాకాలు(రూ.32,000) చెల్లించాల్సి ఉంటుంది. స్టార్ లింక్ డిష్, రౌటర్‌తో సహా పరికరాల ఖర్చులు ఇందులో కవర్ అవుతాయి.
ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
స్టార్‌లింక్ ప్రత్యేకతలు
అంతరిక్షంలోని ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నేరుగా భూమిపై ఉన్న వివిధ డివైజ్‌లకు చేరుతుంది.
ఈ కనెక్షన్‌కు చందా కేబుల్ సర్వీస్ డైరెక్ట్ టు హోం (డీటీహెచ్)కు కట్టిన మాదిరిగా ఉంటుంది.
ఇంటర్నెట్ కోసం ఈ కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిష్ కిట్‌ను అందజేస్తుంది. దీనిని ఇంటిపై శాశ్వత పద్ధతిలో బిగించవచ్చు.
ముందుగా ఇళ్లలో వైఫై రూటర్ ఆధారిత వైర్ కనెక్షన్ కలిగి ఉండాలి. దీనిని ఆ తర్వాత వైర్‌లెస్ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గాడ్జెట్స్‌కు జతచేయొచ్చు.
ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సర్వీస్ అందించగలదు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.