బంగారానికి కావాలా లాకర్‌? టాప్‌ బ్యాంకుల్లో చార్జీలివే.. | ⁠Top Bank Locker Charges Compared SBI PNB ICICI Bank HDFC Bank | Sakshi
Sakshi News home page

బంగారానికి కావాలా లాకర్‌? టాప్‌ బ్యాంకుల్లో చార్జీలివే..

May 22 2025 1:25 PM | Updated on May 22 2025 1:41 PM

⁠Top Bank Locker Charges Compared SBI PNB ICICI Bank HDFC Bank

బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారమే రూ.లక్ష వరకూ పలుకుతోంది. బంగారం సాధారణంగా చాలా మంది దగ్గర ఆభరణాల రూపంలోనే ఉంటుంది. వీటిని ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగిలిన సమయాల్లో పెద్దగా ధరించరు. ఈ నగలను ఇంట్లోని బీరువాల్లోనే భద్రపరుచుకుంటుంటారు. అయితే విలువైన బంగారు ఆభరణాలను ఇలా ఇంట్లో పెట్టుకుంటే వల్ల చోరీకి గురవుతాయేమోనన్న ఆందోళన చాలా మందిలో ఉంటుంది. అందుకే అనేక బ్యాంకులు బంగారంతోపాటు విలువైన డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు సేఫ్‌ డిపాజిట్‌ లాకర్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

ఈ సేఫ్ డిపాజిట్ లాకర్లలో బంగారం, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు బ్యాంకులు కొంత చార్జీలను వసూలు చేస్తాయి. లాకర్ పరిమాణం, బ్రాంచ్ లొకేషన్ (గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ లేదా మెట్రో), బ్యాంక్ అంతర్గత విధానాల ఆధారంగా ఈ లాకర్లకు అద్దె ఛార్జీలు మారవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని  నాలుగు టాప్‌ బ్యాంకులలో సేఫ్‌ డిపాజిట్‌ లాకర్ల చార్జీలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాకర్ పరిమాణం, స్థానాన్ని బట్టి మారుతూ ఉండే అంచెల ధరల నిర్మాణాన్ని అందిస్తుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు వర్తిస్తుంది. ఇది చిన్న, మధ్యతరహా లాకర్లకు రూ .500, పెద్ద, ఎక్స్‌ట్రా లార్జ్‌ లాకర్లకు రూ .1,000. వీటికి జీఎస్టీ అదనం.

వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా):
చిన్న లాకర్లు: 
రూరల్/ సెమీ అర్బన్: రూ.1,000 
అర్బన్/ మెట్రో: రూ.1,500

మీడియం లాకర్లు: 
రూరల్/ సెమీ అర్బన్: రూ.2,000 
అర్బన్/ మెట్రో: రూ.3,000

పెద్ద లాకర్లు: 
రూరల్/ సెమీ అర్బన్: రూ.5,000
అర్బన్/ మెట్రో: రూ.6,000

ఎక్స్‌ట్రా లార్జ్‌ లాకర్లు: 
రూరల్/ సెమీ అర్బన్: రూ.7,000 
అర్బన్/ మెట్రో: రూ.9,000

పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేఫ్‌ లాకర్ల కోసం అందుబాటు చార్జీలను వసూలు చేస్తోంది. కొన్ని నిర్దిష్ట మెట్రో శాఖలలో 25% ప్రీమియం వర్తిస్తుంది. కస్టమర్లు సంవత్సరానికి 12 సార్లు ఉచితంగా తమ లాకర్‌ను  సందర్శించవచ్చు. ఆ తర్వాత ప్రతి అదనపు సందర్శనకు రూ .100 వసూలు చేస్తారు.

వార్షిక ఛార్జీలు ఇలా.. (జీఎస్టీ కాకుండా)
చిన్న లాకర్లు: 
రూరల్: రూ.1,000 
సెమీ అర్బన్/ అర్బన్: రూ.1,250 
అర్బన్/ మెట్రో: రూ.2,000

మీడియం లాకర్లు: 
గ్రామీణం: రూ.2,200 
సెమీ అర్బన్/ అర్బన్: రూ.2,500 
అర్బన్/ మెట్రో: రూ.3,500

పెద్ద లాకర్లు: 
రూరల్, సెమీ అర్బన్: రూ.3,000 
అర్బన్/ మెట్రో: రూ.5,500

ఎక్స్‌ట్రా లార్జ్‌ లాకర్లు: 
రూరల్, సెమీ అర్బన్: రూ.6,000 
అర్బన్/ మెట్రో: రూ.8,000

ఎక్స్‌ట్రా లార్జ్‌ లాకర్లు: 
అన్ని ప్రాంతాల్లో: రూ.10,000

ఐసీఐసీఐ బ్యాంక్ 
వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): 
చిన్న లాకర్లు: 
గ్రామీణం: రూ.1,200 
సెమీ అర్బన్: రూ.2,000 
అర్బన్: రూ.3,000 
మెట్రో: రూ.3,500 
మెట్రో+: రూ.4,000

మీడియం లాకర్లు: 
గ్రామీణం: రూ.2,500 
సెమీ అర్బన్: రూ.5,000 
అర్బన్: రూ.6,000 
మెట్రో: రూ.7,500 
మెట్రో+: రూ.9,000

పెద్ద లాకర్లు: 
గ్రామీణం: రూ.4,000 
సెమీ అర్బన్: రూ.7,000 
అర్బన్: రూ.10,000 
మెట్రో: రూ.13,000 
మెట్రో+: రూ.15,000

ఎక్స్‌ట్రా లార్జ్‌ లాకర్లు: 
గ్రామీణం: రూ.10 వేలు 
సెమీ అర్బన్: రూ.15,000 
అర్బన్: రూ.16,000 
మెట్రో: రూ.20,000 
మెట్రో+: రూ.22,000

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 
వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): 
ఎక్స్‌ట్రా స్మాల్‌ లాకర్లు: 
మెట్రో: రూ.1,350 
పట్టణ: రూ.1,100 
సెమీ అర్బన్: రూ.1,100 
గ్రామీణం: రూ.550

చిన్న లాకర్లు: 
మెట్రో: రూ.2,200 
పట్టణ: రూ.1,650 
సెమీ అర్బన్: రూ.1,200 
గ్రామీణం: రూ.850

మీడియం లాకర్లు: 
మెట్రో: రూ.4,000 
అర్బన్: రూ.3,000 
సెమీ అర్బన్: రూ.1,550 
గ్రామీణం: రూ.1,250

ఎక్స్‌ట్రా మీడియం లాకర్లు: 
మెట్రో: రూ.4,400 
పట్టణ: రూ.3,300 
సెమీ అర్బన్: రూ.1,750 
రూరల్: రూ.1,500

పెద్ద లాకర్లు: 
మెట్రో: రూ.10,000 
అర్బన్: రూ.7,000 
సెమీ అర్బన్: రూ.4,000 
గ్రామీణం: రూ.3,300

ఎక్స్‌ట్రా లార్జ్‌ లాకర్లు: 
మెట్రో: రూ.20,000 
పట్టణ: రూ.15 వేలు 
సెమీ అర్బన్: రూ.11,000 
గ్రామీణం: రూ.9,000

🔶 లాకర్ సదుపాయాన్ని ఎంచుకునేటప్పుడు ధర మాత్రమే ముఖ్యం కాదు. లభ్యత, ఎంత దగ్గరలో ఉంది, లాకర్ పరిమాణం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ముందస్తు సరెండర్ పాలసీలు లేదా రిజిస్ట్రేషన్ ఫీజులు వంటివి ఏవైనా అదనపు నిబంధనలు ఉన్నాయేమో చూసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement