
వాష్టింగ్టన్: భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో తయారు చేసిన ఐఫోన్లను అమెరికాలో అమ్ముతామంటే ఉపేక్షించబోనని ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో తయారు చేసిన ఐఫోన్‌లను దేశీయంగా అమ్మితే 25 శాతం టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు.
ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌గా ఓ వేదికగా ఓ పోస్టును షేర్ చేశారు. అందులో ‘నేను చాలా కాలం క్రితమే నేను ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌కుక్ చెప్పాను. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని, విదేశాల్లో కాదని. భారత్‌తో పాటు మరో ఇతర దేశంలోనైనా తయారు చేసిన ఐఫోన్లను ఇక్కడ అమ్మితే వాటిపై యాపిల్ కంపెనీ అమెరికాకు కనీసం 25 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే’అని పేర్కొన్నారు.
Time for Apple to manufacture in America or pay the tariffs. pic.twitter.com/KOnDC8NKDr
— Gunther Eagleman™ (@GuntherEagleman) May 23, 2025
అయితే, ట్రంప్ విధించే టారిఫ్‌లు యాపిల్ ఒక్క కంపెనీకే పరిమితం అవుతుందా? లేదంటే అన్నీ కంపెనీలపై సుంకం విధిస్తారా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
మరోవైపు, అమెరికా,చైనా సుంకాల యుద్ధంతో అవరోధాలు తలెత్తుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ తయారీకి భారత్ ప్రత్యాహ్నాయంగా భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో భారీ ఎత్తున తయారీ రంగంలో పెట్టుపెట్టేందుకు సిద్ధమైంది. కాగా, యాపిల్ నివేదిక ప్రకారం.. జూన్ త్రైమాసికంలో అమెరికాలో అమ్మే ఫోన్లలో ఎక్కువ శాతం భారత్‌లో తయారు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.