
సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికం శాఖ (డాట్) తాజాగా ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’ (ఎఫ్‌ఆర్‌ఐ) పేరిట వినూత్న సాధనాన్ని ప్రవేశపెట్టింది. మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను రిస్కు స్థాయిని బట్టి ఇది వర్గీకరిస్తుంది. ఆ వివరాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం ద్వారా టెలికం శాఖ షేర్ చేస్తుంది.
దీనిద్వారా రిస్కీ మొబైల్ నంబర్లతో ఆర్థిక లావాదేవీలను సత్వరం నిలిపివేసేందుకు ఇది ఉపయోగపడుతుందని డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణమైనవిగా కనిపించినా వాస్తవానికి సైబర్ ఫ్రాడ్ కేసులతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను గుర్తించేందుకు దీనితో అత్యధికంగా అవకాశాలు ఉంటున్నట్లు ఫోన్‌పే గణాంకాల్లో వెల్లడైందని డాట్ పేర్కొంది. సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, చక్షు ప్లాట్‌ఫాం, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లభించే వివరాల ప్రాతిపదికన మొబైల్ నంబర్లను ‘మధ్య స్థాయి’, ‘అధిక’, ‘అత్యధిక’ రిస్కుల కింద ఎఫ్‌ఆర్‌ఐ వర్గీకరిస్తుంది.
ఇదీ చదవండి: ఎన్‌ఎస్‌ఈ ఐపీవో సవాళ్లకు చెక్
ఎయిర్‌టెల్ యూజర్లకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజీ
కస్టమర్లకు క్లౌడ్ స్టోరేజీ ప్రయోజనాలను అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్‌తో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లందరికీ ఆరు నెలల పాటు 100 జీబీ మేర గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌్రస్కిప్షన్ సర్వీసు ఉచితంగా లభిస్తుంది. దీన్ని మరో అయిదుగురితో షేర్ చేసుకోవచ్చు. 6 నెలల ఉచిత వ్యవధి పూర్తయిన తర్వాత నుంచి నెలకు రూ. 125 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డివైజ్‌లలో డేటా స్టోరేజ్ పరిమితుల వల్ల మాటిమాటికీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో క్లౌడ్ స్టోరేజీ ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది.