డీ2డీ సర్వీసులకు మార్గం సుగమం | Telecom connectivity in India could soon remotest corners of the country | Sakshi
Sakshi News home page

డీ2డీ సర్వీసులకు మార్గం సుగమం

Nov 14 2025 11:14 AM | Updated on Nov 14 2025 11:26 AM

Telecom connectivity in India could soon remotest corners of the country

దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు టెలికాం కనెక్టివిటీని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. డైరెక్ట్-టు-డివైస్ (D2D) శాటిలైట్‌ కమ్యూనికేషన్ సేవల కోసం నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌పై సిఫార్సులు కోరడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను సంప్రదించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిఫార్సులు అమలులోకి వస్తే ఉపగ్రహాలతో అంతరాయం లేకుండా మొబైల్ కనెక్టివిటీని అందించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం D2D శాట్‌కామ్‌ సేవలను అనుమతించడానికి భారతదేశంలో ఎటువంటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ లేదు. అయితే యూఎస్‌, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే ఉపగ్రహ నెట్‌వర్క్‌లతో మొబైల్ కవరేజీని అనుసంధానించడానికి నియమాలను అవలంబిస్తున్నాయి. ఉదాహరణకు, యూఎస్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌ టి-మొబైల్ (T-Mobile)తో భాగస్వామ్యం కుదుర్చుకుని సెల్ టవర్లు లేని ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందిస్తున్నారు. ఇది ఫోన్లను నేరుగా ఉపగ్రహాలతో కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తోంది. త్వరలో భారత్‌లోనూ ఈ సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు కంపెనీ తెలిపింది.

భారతీయ టెల్కోల ఆందోళన

భారతీయ టెలికాం సంస్థలు (టెల్కోలు) చాలా కాలంగా D2D సేవలను తమ వ్యాపార నమూనాలకు ముప్పుగా చూస్తున్నాయి. వినియోగదారులకు నేరుగా ఉపగ్రహ ఆపరేటర్లు  కనెక్టివిటీని అందించే క్రమంలో వారు సాధారణ టెలికాం సంస్థల మాదిరిగానే నియంత్రణ బాధ్యతలకు లోబడి ఉండాలని వాదిస్తున్నారు. ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి డాట్‌ టెలికాం సంస్థలు, శాటిలైట్ సంస్థలు, ఇతర నిపుణులతో ట్రాయ్ నేతృత్వంలో సంప్రదింపులు జరపాలని చూస్తోంది.

ఈ సంప్రదింపుల్లో D2D సేవలకు అనువైన అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (IMT) బ్యాండ్లను గుర్తించనున్నారు. శాటిలైట్ ఆపరేటర్లు, టెలికాం సంస్థల మధ్య సమాన అవకాశాలు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాయ్ అధికారికంగా సిఫార్సులను కోరే ముందు D2D సేవల సాంకేతిక, వాణిజ్య అంశాలను బాగా అర్థం చేసుకోవడానికి DoT ఇప్పటికే కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement