ఉల్లాసంగా ఉత్సాహంగా..అందంగా,ఆరోగ్యంగా! | healthy happy lifes check these amazing and best food | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా ఉత్సాహంగా..అందంగా,ఆరోగ్యంగా!

May 24 2025 3:56 PM | Updated on May 24 2025 3:56 PM

healthy  happy lifes check these amazing and best food

ఆడుతు పాడుతు పని చేస్తే అలుపూ సొలుపేమున్నది అని ఓ  పాట ఉంది. అలాగే నాకు అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని అనకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచు తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన  సొంతం అవుతాయి. అవేమిటో చూద్దాం...

టొమాటో... 
దీనిలోని లైకోపిన్‌ కాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో  పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే.

నట్స్‌...
ముఖ్యంగా వాల్‌నట్స్‌ లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్‌ స్టెరోల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్టరాల్‌ లెవల్‌ తగ్గించడంలో వీటి పాత్ర అమోఘం. వాల్నట్స్‌లో పీచుపదార్థం అధికం. మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్‌–ఇ, ఉండి శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్స్‌ని అందిస్తాయి. బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. ఆస్టియో పోరోసిస్‌ రాకుండా ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హాని నుండి కాపాడుతుంది. ఆల్మండ్స్‌ చర్మకాంతికి తోడ్పడతాయి. 

గ్రీన్‌ టీ... : ఇది ఓ సూపర్‌ డ్రింక్‌. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్‌ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది.

చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది
 

బీన్స్‌...: ప్రోటీన్స్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్‌. ఇవన్నీ బీన్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్‌ లెవెల్స్‌ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్‌తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు.

ఆకుకూరలు...: ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్‌ల నుండి కా పాడుతాయి. వీటిలో విటమిన్‌ బి, సి, ఇ, ఫోలేట్, పొటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్‌ను నిరోధించడంలో  పాలకూర తోడ్పడుతుంది. 

ఇదీ చదవండి: Pressure Cooker: వీటిని అస్సలు కుక్‌ చేయెద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement