
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల వాతావరణంలో స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో 82,021 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 410.19 పాయింట్లు (0.51 శాతం) పెరిగి 81,596.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 129.55 పాయింట్లు లేదా 0.52 శాతం లాభపడి 24,813.45 వద్ద ముగిసింది.
బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 1.87 శాతం వరకు నష్టపోయాయి.
బీఎస్ఈలో ట్రేడైన 4,115 షేర్లలో 2,304 షేర్లు లాభాల్లో ముగియగా, 1,674 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.78 శాతం, 0.38 శాతం లాభాలతో ముగిశాయి.
రంగాలవారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఎన్ ఎస్ ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు లాభాల్లో స్థిరపడగా, నిఫ్టీ రియాల్టీ, ఫార్మా సూచీలు వరుసగా 1.72 శాతం, 1.25 శాతం లాభపడ్డాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.93 శాతం పెరిగి 17.55 పాయింట్ల వద్ద స్థిరపడింది.