దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం నష్టాలలో ముగిశాయి. ఐటీ, ఆటో స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి, సెన్సెక్స్ గడువు ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మందగించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 367.25 పాయింట్లు లేదా 0.43 శాతం నష్టపోయి 85,041.45 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 99.80 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 26,042.30 వద్ద స్థిరపడింది.
టైటాన్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ బీఎస్ఈలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్స్.
ఎన్ఎస్ఈలో టైటాన్, హిండాల్కో, నెస్లే ఇండియా టాప్ విన్నర్లుగా ఉండగా, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
విస్తృత మార్కెట్లు కూడా ప్రతికూలంగానే ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.23 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.08 శాతం నష్టపోయాయి. సెక్టార్ వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 1.03 శాతం, ఆటో 0.52 శాతం నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ మెటల్ 0.59 శాతం లాభంతో ముగిసింది.


