మెడికల్‌ ఇంప్లాంట్‌.. ఫుల్‌ డిమాండ్‌..! | India ortho implant sector may hit 5 billion by FY28 on strong demand | Sakshi
Sakshi News home page

మెడికల్‌ ఇంప్లాంట్‌.. ఫుల్‌ డిమాండ్‌..!

May 21 2025 12:56 AM | Updated on May 21 2025 7:56 AM

India ortho implant sector may hit 5 billion by FY28 on strong demand

భారీగా విస్తరిస్తున్న మార్కెట్‌ 

2027–28 నాటికి 5 బిలియన్‌ డాలర్లు 

ఆర్థోపెడిక్, కార్డియాక్‌ ఇంప్లాంట్లపై కేర్‌ఎడ్జ్‌ నివేదిక

ముంబై: ఆర్థోపెడిక్, కార్డియాక్‌ ఇంప్లాంట్ల వ్యాపారం 2027–28 నాటికి 4.5–5 బిలియన్‌ డాలర్ల స్థాయికి (సుమారు రూ.42,500 కోట్లు) విస్తరిస్తుందని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. దేశీయంగా బలమైన డిమాండ్‌కు తోడు, ఎగుమతులు క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. ఆర్థోపెడిక్, కార్డియాక్‌ ఇంప్లాంట్ల వ్యాపారం (ఎగుమతులు సహా) 2024 మార్చి నాటికి 2.4–2.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో తలసరి ఆదాయం పెరుగుతుండడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహనలో మార్పు, వృద్ధ జనాభా పెరుగుతుండడం, ఆరోగ్య సదుపాయాల విస్తరణ, ఆరోగ్య బీమా కవరేజీ విస్తృతి ఇవన్నీ ఈ రంగం వృద్ధికి సానుకూలిస్తాయని కేర్‌ఎడ్జ్‌ నివేదిక వివరించింది.

ఇటీవలి సంవత్సరాల్లో బహళజాతి ఇంప్లాంట్‌ కంపెనీల కంటే దేశీ తయారీదారులే ఎక్కువ వృద్ధి చెందుతున్నట్టు పేర్కొంటూ.. పోటీతో కూడిన ధరలకుతోడు సామర్థ్యాలను సమకూర్చుకోవడాన్ని గుర్తు చేసింది. ఇంప్లాంట్లకు సంబంధించి బలమైన టెక్నాలజీ సామర్థ్యాలు అవసరమని.. ఈ విభాగాన్ని ప్రధానంగా విదేశీ ఎంఎన్‌సీలే శాసిస్తున్నట్టు తెలిపింది.

అయితే దిగుమతులను భారత్‌ క్రమంగా తగ్గించుకుంటున్నట్టు.. దేశీ ఇంప్లాంట్‌ తయారీదారులు ఏటా 28 శాతం చొప్పున 2023–24 వరకు వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిని సాధించినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో అమ్మకాలు ఏటా 12 శాతం పెరిగినట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రాయోజిత బీమా పథకాల్లో పాల్గొనడంతోపాటు పోటీ ధరల ఫలితంగా విదేశీ ఎంఎన్‌సీల కంటే భారతీయ కంపెనీలే అమ్మకాల్లో అధిక వృద్ధిని నమోదు చేస్తున్నట్టు వివరించింది.

ఎగుమతుల్లోనూ సత్తా..
గడిచిన కొన్నేళ్ల నుంచి భారత ఇంప్లాంట్‌ తయారీ కంపెనీలు విదేశీ ఎంఎన్‌సీలను స్థానిక మార్కెట్‌లో సవాలు చేయడమే కాకుండా ఎగుమతుల మార్కెట్లోనూ గట్టి పోటీనిస్తున్నట్టు కేర్‌ఎడ్జ్‌ నివేదిక వెల్లడించింది. ఇంప్లాంట్‌ మార్కెట్లో ఉన్న అవకాశాల నేపథ్యంలో జైడస్‌ లైఫ్‌ సైన్సెస్, ఆల్కెమ్‌ ల్యాబొరేటరీస్‌ తదితర బడా ఫార్మా కంపెనీలు ఇంప్లాంట్ల తయారీ, పంపిణీపై పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న వాణిజ్యం, టారిఫ్‌ల అనిశ్చితులు, ధరలపై పరిమితుల విధింపు, నియంత్రణలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. గుండెలో స్టెంట్లు, మోకాళ్ల చిప్పలు ఇవన్నీ కూడా ఇంప్లాంట్ల కిందకే వస్తాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement