breaking news
Cardiac surgery
-
నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
హైదరాబాద్: కొందరు చిన్నారులు పిల్లలు పుట్టుకతోనే వ్యాధులతో బాధపడుతుంటారు. వాటిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోగలుగుతారు. కానీ పేద , మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నది. అప్పుడే పుట్టిన శిశువుల మొదలు 14 ఏళ్ల చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఇందుకు గాను బ్రిటన్ వైద్యులు నిమ్స్‌కు రానున్నారు.ప్రముఖ వైద్యులు, తెలంగాణకు చెందిన డాక్టర్ రమణ దన్నపనేని నేతృత్వంలోని ఈ బృందం ఏటా సెప్టెంబర్‌లో వారం రోజుల పాటు ఉచిత గుండె ఆపరేషన్ల శిబిరాన్ని నిర్వహిస్తుంది. కార్డియోథొరాసిక్ వైద్యుల సమన్వయంతో నిర్వహించే శిబిరాన్ని ఈ నెల 14 నుంచి 20 వరకు నిమ్స్‌లో నిర్వహించనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప (Bheerappa Nagari) తెలిపారు. కొన్ని క్లిష్టమైన సర్జరీలను సైతం యూకే డాక్టర్ల చేత నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు ఉచితంగా 2డి ఎకోకార్డియోగ్రామ్ స్క్రీనింగ్‌లు చేస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ పీడియాట్రిక్ విభాగంలో నెలకు 25 సర్జరీలు పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ (Paediatric Cardiac ICU) ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు చేశామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. రెండేళ్ల నుంచి నెలకు 20 నుంచి 25 సర్జరీలు చేయగా ప్రస్తుతం నెలకు 35 సర్జరీలు చేస్తున్నామన్నారు. శిశువు పుట్టిన వెంటనే చేసే సర్జరీల నుంచి, ఏడాదికి, రెండేళ్లు, ఐదేళ్లకు ఇలా పరిమిత సమయంలోపే చేసే సర్జరీలు కూడా ఉంటాయన్నారు. ఆ సమయంలోగా చేయకపోతే ఆ సమస్యలు ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయన్నారు. నిమ్స్‌కు వచ్చే కేసులు ఎక్కువగా క్రిటికల్‌లో ఉన్నవే వస్తుంటాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా గుండె మార్పిడి చికిత్సల నుంచి రోబోటిక్ చికిత్సలను చేస్తున్నామన్నారు.రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి.. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప గుండె సంబంధిత సమస్యలున్న చిన్నారుల తల్లిదండ్రులు 040– 23489025లో సంప్రదింవచ్చని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. నిమ్స్ పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అరమేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ గోపాల్‌లను మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలని, పూర్వపు రిపోర్టులు తమ వెంట తీసుకురావాలని సూచించారు. చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత!రికార్డు అందుబాటులో లేకుంటే.. ఆస్పత్రిలోనే అవసరమైన స్కీన్రింగ్ నిర్వహిస్తామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 25 మంది చిన్నారులకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేసినా.. ఆ తర్వాత కూడా దశల వారీగా నిమ్స్ వైద్యులు ఆపరేషన్లు కొనసాగిస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఈ ఏడాది దాదాపు 350 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఈ చికిత్సలకు అయ్యే ఖర్చును ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. -
మెడికల్ ఇంప్లాంట్.. ఫుల్ డిమాండ్..!
ముంబై: ఆర్థోపెడిక్, కార్డియాక్ ఇంప్లాంట్ల వ్యాపారం 2027–28 నాటికి 4.5–5 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.42,500 కోట్లు) విస్తరిస్తుందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయంగా బలమైన డిమాండ్‌కు తోడు, ఎగుమతులు క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. ఆర్థోపెడిక్, కార్డియాక్ ఇంప్లాంట్ల వ్యాపారం (ఎగుమతులు సహా) 2024 మార్చి నాటికి 2.4–2.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో తలసరి ఆదాయం పెరుగుతుండడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహనలో మార్పు, వృద్ధ జనాభా పెరుగుతుండడం, ఆరోగ్య సదుపాయాల విస్తరణ, ఆరోగ్య బీమా కవరేజీ విస్తృతి ఇవన్నీ ఈ రంగం వృద్ధికి సానుకూలిస్తాయని కేర్ఎడ్జ్ నివేదిక వివరించింది.ఇటీవలి సంవత్సరాల్లో బహళజాతి ఇంప్లాంట్ కంపెనీల కంటే దేశీ తయారీదారులే ఎక్కువ వృద్ధి చెందుతున్నట్టు పేర్కొంటూ.. పోటీతో కూడిన ధరలకుతోడు సామర్థ్యాలను సమకూర్చుకోవడాన్ని గుర్తు చేసింది. ఇంప్లాంట్లకు సంబంధించి బలమైన టెక్నాలజీ సామర్థ్యాలు అవసరమని.. ఈ విభాగాన్ని ప్రధానంగా విదేశీ ఎంఎన్‌సీలే శాసిస్తున్నట్టు తెలిపింది.అయితే దిగుమతులను భారత్ క్రమంగా తగ్గించుకుంటున్నట్టు.. దేశీ ఇంప్లాంట్ తయారీదారులు ఏటా 28 శాతం చొప్పున 2023–24 వరకు వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిని సాధించినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో అమ్మకాలు ఏటా 12 శాతం పెరిగినట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రాయోజిత బీమా పథకాల్లో పాల్గొనడంతోపాటు పోటీ ధరల ఫలితంగా విదేశీ ఎంఎన్సీల కంటే భారతీయ కంపెనీలే అమ్మకాల్లో అధిక వృద్ధిని నమోదు చేస్తున్నట్టు వివరించింది.ఎగుమతుల్లోనూ సత్తా..గడిచిన కొన్నేళ్ల నుంచి భారత ఇంప్లాంట్ తయారీ కంపెనీలు విదేశీ ఎంఎన్‌సీలను స్థానిక మార్కెట్లో సవాలు చేయడమే కాకుండా ఎగుమతుల మార్కెట్లోనూ గట్టి పోటీనిస్తున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక వెల్లడించింది. ఇంప్లాంట్ మార్కెట్లో ఉన్న అవకాశాల నేపథ్యంలో జైడస్ లైఫ్ సైన్సెస్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ తదితర బడా ఫార్మా కంపెనీలు ఇంప్లాంట్ల తయారీ, పంపిణీపై పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న వాణిజ్యం, టారిఫ్‌ల అనిశ్చితులు, ధరలపై పరిమితుల విధింపు, నియంత్రణలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. గుండెలో స్టెంట్లు, మోకాళ్ల చిప్పలు ఇవన్నీ కూడా ఇంప్లాంట్ల కిందకే వస్తాయి. -
చిట్టి గుండెకు గట్టి అండ
లక్డీకాపూల్: అంతర్జాతీయ ప్రమాణాలతో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఇక నుంచి నవజాత శిశువులకు సైతం హృద్రోగ శస్త్రచికిత్సలు చేయనుంది. పుట్టుకతో ఏర్పడే గుండె సమస్యలకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనుంది. జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్, సువెన్ ఫార్మాసూటికల్స్ సహకారంతో రూ. 5 కోట్లతో నిమ్స్‌లో నూతనంగా నవజాత హృదయ సంబంధ శస్త్రచికిత్సల విభాగం (పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్) ఏర్పాటైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ విభాగాన్ని ఇటీవల ప్రారంభించారు. 50 పడకలు.. ఆధునిక సదుపాయాలు 50 పడకలతో కూడిన పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్ విభాగంలో 6 పడకల అత్యాధునిక మాడ్యులర్ కార్డియోథొరాసిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) కూడా ఉంది. నవజాత శిశువుల్లో గుండె మార్పిడి కోసం అనువైన క్లాస్–1 ఎయిర్ కండిషన్డ్ ఐసొలేషన్ వార్డును సైతం నిమ్స్ సమకూర్చుకుంది. అతిసూక్ష్మమైన వైరస్, బ్యాక్టీరియాలను తొలగించే ఆధునిక హెప్పా ఫిల్టర్లు ఉండటం ఈ వార్డు ప్రత్యేకత. అంతేకాకుండా నెలలు నిండని, తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు వెచ్చదనం ఇచ్చే వార్మర్లు తదితర సదుపాయాల కోసం పీడియాట్రిక్, నియోనాటల్ సామర్థ్యాలను కూడా నిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. శస్త్ర చికిత్సల సమయంలో శరీరంలో చోటుచేసుకొనే మార్పులను పసిగట్టి వైద్యులను ముందే హెచ్చరించే అధునాతన కార్డియాక్ అవుట్‌పుట్ మానిటర్‌ను సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పిల్లల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చే నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా యంత్రాన్ని సమకూర్చారు. రూ.40 లక్షలతో హార్ట్ లంగ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫస్ట్.. నిమ్స్ తరహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. నవజాత శిశువుల్లో పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడినప్పుడు శస్త్రచికిత్సలు చేయడానికి ఈ విభాగం ఎంతో ఉపయోగపడుతుంది. – డాక్టర్ ఎం. అమరేష్‌రావు, నిమ్స్ సీటీ సర్జన్ (చదవండి: -
ఐదేళ్ల చిన్నారికి లివర్ మార్పిడి
హైదరాబాద్: వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ చిన్నారికి అపొలో ఆసుపత్రి వైద్యులు అతి క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి వేగంగా కోలుకుంటోంది. వైద్యులు తెలిపిని వివరాలివీ.. పార్వతి రొహ్రా(5) జన్యు సంబంధమైన అలగిల్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. కేవలం పది కిలోల బరువున్న బాలికకు లివర్ సిర్రోసిస్, పూర్తిగా శరీర ఎదుగుదల లోపించటం, రికెట్స్ వ్యాధి వంటి చాలా సంక్లిష్టమైన సమస్యలున్నాయిని వైద్యులు తెలిపారు. లక్షమందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి కారణంగా గుండె, కాలేయ సంబంధ వ్యాధులు తలెత్తాయి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు జనవరి 23వ తేదీన ముందుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అనంతరం ఆమె తల్లి లివర్ నుంచి చిన్న భాగాన్ని సేకరించి పార్వతికి అమర్చారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది ఒక మైలురాయి వంటిదని పేర్కొన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణతో కోలుకున్న ఆమెను ఫిబ్రవరి ఏడో తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆమె వయస్సుకు తగ్గట్లుగా ఎదిగేందుకు, రికెట్స్ నుంచి బయటపడేందుకు విటమిన్ డి సప్లిమెంట్స్‌ను ఇస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో బాలిక పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు వివరించారు. -
ఆసుపత్రి నుంచి లాలూ డిశ్చార్జి
ముంబయి: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌ను డిశ్చార్జి చేసినట్లు ఆ ఆసుపత్రి వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ రామాకాంత్ పండా శనివారం వెల్లడించారు. గుండెకు శస్త్ర చికిత్స జరిగిన లాలూ ప్రసాద్ యాదవ్ చాలా త్వరగా కొలుకున్నారని చెప్పారు. ఆయనకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంత కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టులో ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. గత నెల 27వ తేదీన ఏషియన్ ఇనిస్టిట్యూట్ వైద్యులు లాలూకు గుండెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.