
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) ‘హోండా రెబల్ 500’ పేరుతో కొత్త మోటార్ సైకిల్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ.5.12 లక్షలు (ఎక్స్–షోరూమ్)గా ఉంది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూన్ నుంచి మొదలవుతాయి.
గురుగ్రామ్, ముంబై, బెంగళూరులోని ఎంపిక చేసిన బిగ్‌వింగ్ డీలర్íÙప్‌లో బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ జూన్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. 471 సీసీ లిక్విడ్–కూల్డ్, 4–స్ట్రోక్, 8–వాల్వ్, ప్యారలల్ ట్విన్–సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన రెబల్ 500ను భారత్‌కు తీసుకురావడం సంతోషంగా ఉందని కంపెనీ ఎండీ, సీఈఓ సత్సుము ఒటానీ తెలిపారు.