
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లో భారీ వర్షం కురిసింది. అలాగే సనత్ నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, మెహదీపట్నం, టోలీచౌకీ, గోల్కోండ తదితర ప్రాంతాల్లోనూ వాన పడింది.

దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఇంకా చిరు జల్లులు పడుతుండగా.. రేపు భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది.

నైరుతి(Southwest Monsoon) రుతుపవనాలు సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే కేరళను తాకాయి. దీంతో రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది.
Ameerpet metro station 🌧️ #HyderabadRains#Hyderabad pic.twitter.com/svyXFaOb0b
— Rajesh (@bekindtoevery_1) May 24, 2025
#24MAY 7:30PM⚠️
Pouring So Heavily in Northern & Western Parts of the City #Hyderabadrains pic.twitter.com/gNR0GD4WZc— Hyderabad Rains (@Hyderabadrains) May 24, 2025