
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ పాల్గొన్నారు. ఇటీవల సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు.
కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి.