
సాక్షి, కరీంనగర్: వేములవాడ ఆలయంలో ఇంటి దొంగ బాగోతం బయటపడింది. సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి నిర్వాకం వైరల్‌గా మారింది. సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇంటికి తరలిస్తుండగా కొందర భక్తులు మొబైల్‌లో చిత్రీకరించారు. సదరు ఉద్యోగి నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్టతో పాటు, వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
గతంలో యాదాద్రిలో పని చేస్తున్నప్పుడు కూడా సదరు ఉద్యోగిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవో తన బంధువంటూ కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తాడంటూ సోషల్ మీడియాలో సూపరింటెండెంట్ వ్యవహారం వైరల్‌గా మారింది ఇవాళ (అక్టోబర్, 20 సోమవారం) ఒంటిగంట సమయంలో సరకులు తన ఇంటికి తరలిస్తుండగా కొందరు మొబైల్ ఫోన్‌లో షూట్ చేశారు.