రేపే దీపక్‌ రెడ్డి నామినేషన్‌.. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రుల రాక! | BJP Deepak Reddy Will Filed His Nomination On 21st October, More Details Inside | Sakshi
Sakshi News home page

రేపే దీపక్‌ రెడ్డి నామినేషన్‌.. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రుల రాక!

Oct 20 2025 1:04 PM | Updated on Oct 20 2025 3:31 PM

BJP Deepak Reddy will Filed His Nomination On 21st October

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు విజయం కోసం ‍ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి.

ఇక, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి రేపు(మంగళవారం) తన నామినేషన్‌ వేయనున్నారు. ఈ క్రమంలో యూసఫ్‌గూడ హైలం కాలనీ నుంచి షేక్‌పేట్ తహశీల్దార్ ఆఫీస్ వరకు నామినేషన్ ర్యాలీ చేపట్టనున్నట్టు సమాచారం. ఆయన నామినేషన్‌ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముగ్గులు సీఎంలు ముఖ్యఅతిథిలుగా రానున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారికంగా కన్ఫరేషన్ ఇచ్చారు. అసోం, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల కన్ఫరేషన్ కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. కాగా, నామినేషన్ ర్యాలీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున జనసమీకరణతో భారీ ర్యాలీకి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement