
దేశంలోని కొన్ని తయారీ ప్లాంట్లను మూసివేస్తారని వస్తున్న వార్తలను నిస్సాన్ మోటార్ ఇండియా అధికారికంగా తోసిపుచ్చింది. తమ కార్యకలాపాలు, డీలర్లు, భాగస్వాములు, వినియోగదారులకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఇండియాలో తమ సర్వీసులపట్ల నిబద్ధతతో ఉన్నట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.
తయారీ కార్యకలాపాలపై స్పష్టత
నిస్సాన్ కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా మెక్సికోలో ఫ్రాంటియర్, నవరా పికప్స్ ఉత్పత్తి ఏకీకృతం చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ పుకార్లు వెలువడ్డాయి. అయితే ఈ మార్పుల వల్ల భారత తయారీ ప్లాంట్లు ప్రభావితం కావని నిస్సాన్ స్పష్టం చేసింది. భారతదేశంలో తమ వ్యాపార వ్యూహం బలంగా ఉందని, ఏ కర్మాగారంలో కార్యకలాపాలను నిలిపివేసే అధికారిక ప్రణాళికలు లేవని వాటాదారులకు హామీ ఇచ్చింది.
ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
రెనాల్ట్‌కు ఆర్ఎన్ఏఐపీఎల్ వాటా
మార్చి 2025లో రెనాల్ట్ గ్రూప్ రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎన్ఎఐపిఎల్)లో 51% వాటాను కొనుగోలు చేస్తుందని నిస్సాన్ ప్రకటించింది. ఈ చర్య రెనాల్ట్-నిస్సాన్ ప్రపంచ భాగస్వామ్యాన్ని కీలకం కానుందని కంపెనీ తెలిపింది. ఇది చెన్నై ఆధారిత ఉత్పత్తి కేంద్రంపై రెనాల్ట్ పూర్తి నియంత్రణను తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇదిలాఉండగా, నిస్సాన్ భారతదేశ వ్యాపారం పూర్తిగా పనిచేస్తుందని, కస్టమర్ నిమగ్నత, డీలర్‌షిప్ విస్తరణపై నిరంతరం దృష్టి పెడతామని కంపెనీ స్పష్టం చేసింది.