ఎగుమతుల్లో రికార్డ్: భారత్ నుంచి 12 లక్షలు! | Automobile Company Nissan India Hits 12 Lakh Vehicle Export Milestone | Sakshi
Sakshi News home page

ఎగుమతుల్లో రికార్డ్: భారత్ నుంచి 12 లక్షలు!

Oct 31 2025 2:27 PM | Updated on Oct 31 2025 3:18 PM

Automobile Company Nissan India Hits 12 Lakh Vehicle Export Milestone

జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan).. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. ఈ కంపెనీ తన ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు మన దేశం నుంచే ఎగుమతి చేస్తోంది. ఇప్పటి వరకు నిస్సాన్ 12 లక్షల వాహనాలను ఎగుమతి చేసినట్లు ప్రకటించింది.

భారతదేశంలో నిస్సాన్ కంపెనీ మాగ్నైట్ కారును మాత్రమే విక్రయిస్తోంది. కాగా ఎక్స్-ట్రైల్ మోడల్ దిగుమతి చేసుకుంటోంది. అయితే మాగ్నైట్ కారును మనదేశం నుంచి.. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా, యూరప్ వంటి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. కాగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రాంతానికి నిర్దేశించిన 1.2 మిలియన్ల మాగ్నైట్ వాహనాన్ని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స తమిళనాడులోని ఎన్నూర్‌లోని కామరాజర్ పోర్టులో ఆవిష్కరించారు.

నిస్సాన్ కంపెనీ మాగ్నైట్‌తో పాటు.. గతంలో సన్నీ, కిక్స్ & మైక్రా వంటి వివిధ మోడళ్లను ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా & ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేసింది. ఇప్పుడు కేవలం మాగ్నైట్ కారును మాత్రమే ఎగుమతి చేస్తోంది. ఎగుమతి చేయడానికే సంస్థ వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తోంది. కాబట్టి ఇందులో స్టీరింగ్ వీల్ ఎడమవైపు ఉంటుంది. ప్రస్తుతం మాగ్నైట్ 65 దేశాలకు ఎగుమతి అవుతోంది.

ఇదీ చదవండి: 25 ఏళ్లు.. 3.5 కోట్లు: అమ్మకాల్లో యాక్టివా

నిస్సాన్ మాగ్నైట్‌ ఫేస్‌లిఫ్ట్‌
గత సంవత్సరం డిసెంబర్‌లో, నిస్సాన్ మాగ్నైట్‌ను కంపెనీ ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో లాంచ్ చేసింది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందింది. కానీ యాంత్రికంగా ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి అదే 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ & 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement