ప్రముఖ టూ వీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI).. యాక్టివా 110, యాక్టివా 125, యాక్టివా-ఐలతో సహా దాని ప్రసిద్ధ యాక్టివా శ్రేణి.. మొత్తం 35 మిలియన్ (3.5 కోట్లు) అమ్మకాల మైలురాయిని సాధించింది. దీన్నిబట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ స్కూటర్లకు ఉన్న డిమాండ్ స్పష్టంగా అర్థమవుతోంది.
హోండా మోటార్‌సైకిల్.. తన యాక్టివా శ్రేణి స్కూటర్లను 3.5 కోట్ల యూనిట్లను విక్రయించడానికి 25 ఏళ్ల సమయం పట్టింది. 2001లో యాక్టివా స్కూటర్ దేశీయ విఫణిలో ప్రారంభమైంది. 2015 నాటికి 10 మిలియన్ సేల్స్.. 2018 నాటికి 20 మిలియన్ సేల్స్, 2025 నాటికి 35 మిలియన్ సేల్స్ రికార్డ్ సాధ్యమైంది.
యాక్టివా స్కూటర్ భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి.. అనేక అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో డిజైన్ అప్డేట్స్, అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొనుగోలుదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉండటం చేత అమ్మకాలలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది.
ఇదీ చదవండి: ఉన్న కారుకే.. రేంజ్ రోవర్ పేరు: నవ్వుకుంటున్న జనం!
హోండా యాక్టివా వారసత్వాన్ని కొనసాగించడంలో భాగంగా.. కంపెనీ 2025 ఆగష్టులో యాక్టివా & యాక్టివా 125 యానివర్సరీ ఎడిషన్స్ లాంచ్ చేసింది. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడం మాత్రమే కాకుండా.. బలమైన డీలర్ నెట్‌వర్క్‌ను కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో యాక్టివా ఈ, యాక్టివా క్యూసీ1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


