మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ కార్లను కొనాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే.. ధరలు ఎక్కువ కావడం వల్ల ఈ బ్రాండ్ కార్లను కొనుగోలు చేయడం కష్టమే. ఆలా అని ఒక వ్యక్తి ఊరుకోలేదు.. తన దగ్గర ఉన్న కారుకే.. తనకు ఇష్టమైన కారు పేరును రాసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఎక్స్‌టర్ కారుకు, రేంజ్ రోవర్ అని ఉండటం చూడవచ్చు. కాగా రేంజ్ రోవర్ అక్షరాలా కింద హ్యుందాయ్ లోగో, దానికి కింద ఎక్స్‌టర్ అనేది కనిపిస్తున్నాయి. చూడగానే ఇది రేంజ్ రోవర్ అనుకుంటే.. ఎవరైనా పొరబడినట్లే. నిజానికి ఇది చాలామందిని నవ్వుకునేలా చేస్తోంది. పలువురు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
సుమారు రూ. 1 కోటి రూపాయల విలువైన కారు కొనాలనే కల ఉన్నప్పటికీ.. దానిని కొనుగోలు చేయలేనప్పుడు ఏం చేయాలి. తన దగ్గర ఉన్న కారుకే ఆ పేరు రాసుకుని సంతోషిస్తున్నాడని కొందరు చెబుతున్నారు. కాగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. కలలు పెద్దవిగా ఉండాలి, కారు ఏదైనా సరే అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 76 ఏళ్ల విజయానికి గుర్తు!.. ఫెరారీ కొత్త కారు
హ్యుందాయ్ ఎక్స్‌టర్
భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన, కొంత సరసమైన కార్ల జాబితాలో ఒకటి హ్యుందాయ్ ఎక్స్‌టర్. దీని ప్రారంభ ధర రూ. 6.88 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింపుల్ డిజైన్ కలిగిన ఈ కార్లు.. వాహన వినియోగదారులకు కావలసినన్ని ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.


