ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ (Ferrari).. ఎఫ్76 (F76) పేరుతో ఓ కొత్త డిజిటల్ హైపర్‌కార్ కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇతర ఫెరారీ కార్ల కంటే కూడా భిన్నంగా ఉంది. ఇది ప్రస్తుతానికి సాధారణ కారు కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా వర్చువల్ / డిజిటల్ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది.
ఫెరారీ ఎఫ్76 కారును కంపెనీ 2025 అక్టోబర్ 25న ఇటలీలోని ముగేల్లో సర్క్యూట్ వద్ద 'ఫెరారీ ఫినాలి మొండియాలి' ఈవెంట్‌లో దీన్ని ఆవిష్కరించారు. ఎఫ్76 అనేది.. 1949లో ఫెరారీ మొదటిసారి లే మ్యాన్స్ 24 హవర్స్ రేస్ గెలిచినా సందర్భంగా.. ఆ విజయానికి 76 పూర్తయ్యాయని సూచిస్తుంది.
కంపెనీ దీనిని కాన్సెప్ట్ రూపంలో మాత్రమే ఆవిష్కరించింది. ఇది చూడటానికి ఆన్‌లైన్‌లో ఏ వీడియో గేమ్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించే ఓ కారు మాదిరిగా ఉంటుంది. కాబట్టి దీనిని ప్రస్తుతం కొనుగోలు చేయలేరు. అంతే కాకుండా దీనిని డిజైన్ ఫ్రీడమ్ కోసం రూపొందించిన కాన్సెప్ట్. కాబట్టి దీనికి భద్రతా ప్రమాణాలు, హోమోలొగేషన్ వంటి పరిమితులు లేవు. బహుశా భవిష్యత్తులో ఈ కారును కంపెనీ లాంచ్ చేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?
ఫెరారీ ఎఫ్76 కారు డిజైన్ చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ముందు బ్రాండ్ లోగో.. దానికింద ఎక్కువ స్పేస్ ఉంది. ఇందులో లైటింగ్ సెటప్ లేకపోవడం గమనార్హం. సైడ్ ప్రొఫైల్, అల్లాయ్ వీల్స్ మొత్తం కూడా కొత్తగా ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ గమనిస్తే.. ఇండికేటర్ వంటిది చూడవచ్చు. బటర్‌ఫ్లై డోర్స్ కూడా కొత్తగా ఉన్నాయి. స్టీరింగ్ వీల్ సాధారణ ఫెరారీ మాదిరిగా లేదు.


