breaking news
Concept Cars
-
76 ఏళ్ల విజయానికి గుర్తు!.. ఫెరారీ కొత్త కారు
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ (Ferrari).. ఎఫ్76 (F76) పేరుతో ఓ కొత్త డిజిటల్ హైపర్‌కార్ కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇతర ఫెరారీ కార్ల కంటే కూడా భిన్నంగా ఉంది. ఇది ప్రస్తుతానికి సాధారణ కారు కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా వర్చువల్ / డిజిటల్ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది.ఫెరారీ ఎఫ్76 కారును కంపెనీ 2025 అక్టోబర్ 25న ఇటలీలోని ముగేల్లో సర్క్యూట్ వద్ద 'ఫెరారీ ఫినాలి మొండియాలి' ఈవెంట్లో దీన్ని ఆవిష్కరించారు. ఎఫ్76 అనేది.. 1949లో ఫెరారీ మొదటిసారి లే మ్యాన్స్ 24 హవర్స్ రేస్ గెలిచినా సందర్భంగా.. ఆ విజయానికి 76 పూర్తయ్యాయని సూచిస్తుంది.కంపెనీ దీనిని కాన్సెప్ట్ రూపంలో మాత్రమే ఆవిష్కరించింది. ఇది చూడటానికి ఆన్లైన్లో ఏ వీడియో గేమ్ ప్లాట్ఫామ్లో కనిపించే ఓ కారు మాదిరిగా ఉంటుంది. కాబట్టి దీనిని ప్రస్తుతం కొనుగోలు చేయలేరు. అంతే కాకుండా దీనిని డిజైన్ ఫ్రీడమ్ కోసం రూపొందించిన కాన్సెప్ట్. కాబట్టి దీనికి భద్రతా ప్రమాణాలు, హోమోలొగేషన్ వంటి పరిమితులు లేవు. బహుశా భవిష్యత్తులో ఈ కారును కంపెనీ లాంచ్ చేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?ఫెరారీ ఎఫ్76 కారు డిజైన్ చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ముందు బ్రాండ్ లోగో.. దానికింద ఎక్కువ స్పేస్ ఉంది. ఇందులో లైటింగ్ సెటప్ లేకపోవడం గమనార్హం. సైడ్ ప్రొఫైల్, అల్లాయ్ వీల్స్ మొత్తం కూడా కొత్తగా ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ గమనిస్తే.. ఇండికేటర్ వంటిది చూడవచ్చు. బటర్‌ఫ్లై డోర్స్ కూడా కొత్తగా ఉన్నాయి. స్టీరింగ్ వీల్ సాధారణ ఫెరారీ మాదిరిగా లేదు. -
బంతిలాంటి కారు.. దీనికి డ్రైవర్ అవసరం లేదు!
ఒక పెద్దగోళానికి నాలుగు చక్రాలు తగిలించి ఉన్నట్లు కనిపిస్తున్న ఈ విచిత్రవాహనం ఆటబొమ్మ కాదు, అచ్చంగా ప్రయాణాలకు పనికొచ్చే కారు. కంప్యూటర్లు, మొబైల్ఫోన్లు తయారుచేసే యాపిల్ కంపెనీ తాజాగా రూపొందించిన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు ఇది. యాపిల్ కంపెనీ కోసం భారత సంతతికి చెందిన మెకానికల్ డిజైనర్ దేవాంగ బోరా ‘యాపిల్ ఆటోనమస్’ పేరిట ఈ గోళాకార శకటానికి రూపకల్పన చేశారు. ఇందులోని మరో విశేషం ఏమిటంటే, దీనికి డ్రైవర్ అవసరం లేదు. ఇది పూర్తిగా డ్రైవర్‌లెస్ వాహనం. ఇద్దరు మనుషులు ఇందులో సౌకర్యవంతంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ప్రయాణించేవారిని కోరుకున్న చోట దించేశాక ఈ కారు నిర్దేశిత పార్కింగ్ స్థలానికి తనంటత తానే వెళ్లిపోతుంది. ఈ వాహనాన్ని మరో రెండేళ్లలో మార్కెట్లోకి తేవడానికి యాపిల్ సంస్థ సన్నాహాలు చేసుకుంటోంది. (క్లిక్: గూగుల్ కు దిమ్మ తిరిగే షాక్, రూ.65కోట్ల జాక్ పాట్ కొట్టేశాడు!) -
ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు..
గ్రేటర్ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం రెండు ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. వాటి నాణ్యత చూశాక, రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలైనా.. కార్లయినా.. బస్సులైనా.. విద్యుత్ వాహనాల తయారీ, ఎగుమతుల్లో మనం కచ్చితంగా నంబర్ వన్ కాగలమని నాకు అనిపించింది‘ అని ఆయన చెప్పారు. వాహనాల తుక్కు పాలసీ తుది దశల్లో ఉందని, ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది గణనీయంగా మేలు చేయగలదని గడ్కరీ తెలిపారు. మరోవైపు వాహనాలపై జీఎస్టీ తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. భారత దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ‘శాంత్రోవాలా’.. షారుఖ్.. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇప్పటిదాకా అనేక కొత్త కార్లు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ తనకు శాంత్రో కారన్నా, శాంత్రో వాలా ప్రకటన అన్నా తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చెప్పారు. ఆటో ఎక్స్‌పోలో కొత్త క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 22 సంవత్సరాలుగా హ్యుందాయ్‌కి షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. గ్రేట్ వాల్ మోటర్స్ ఉత్పత్తి హవల్ ఎఫ్5 ఎస్‌యూవీతో మోడల్స్ ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ‘ఐడీ క్రాజ్’తో సంస్థ ప్రతినిధులు జేకే మోటర్ స్పోర్ట్స్ పెవిలియన్‌లో రేసింగ్ కారుతో మోడల్స్ ఆటో ఎక్స్‌పోలో సుజుకీ హయబుసా బైక్‌తో మోడల్


