ప్రీమియం ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త మోడల్‌ | Tata Curvv new SUV coupe upgraded featuree check price list automobile | Sakshi
Sakshi News home page

ప్రీమియం ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త మోడల్‌

Nov 14 2025 8:49 AM | Updated on Nov 14 2025 8:48 AM

Tata Curvv new SUV coupe upgraded featuree check price list automobile

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ తన ఎస్‌యూవీ కర్వ్‌ మోడల్‌లో సరికొత్త ఎగ్జిక్యూటివ్‌ ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేక ఇంజనీరింగ్‌ పద్దతుల ద్వారా ఇంటీరియర్‌ స్పేస్‌ పెంచారు. భారతదేశంలోనే తొలిసారి పాసివ్‌ వెంటిలేషన్లు కలిగిన ఆర్‌–కంఫర్ట్‌ సీట్లు అందించారు. వెనుక సీట్లలో కూర్చునే వారి సౌకర్యాన్ని పెంచుతూ సెరినిటీ స్క్రీన్‌ సన్‌షేడ్‌లు, వెనుక ఆర్మ్‌రెస్ట్‌లో ప్రత్యేక కప్‌ హోల్డర్‌లు జోడించారు.

డ్యాష్‌బోర్డ్‌లో వైట్‌ కార్బన్‌ ఫైబర్‌ ఫినిష్, లలిత్‌పూర్‌ గ్రే రంగులోని ప్లష్‌ లెదరైట్‌ సీట్లతో క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను అందించారు. ఇందులో ట్విన్‌–జోన్‌ క్లైమేట్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఫీచర్‌ కూడా చేర్చారు. వాయిస్‌ ద్వారా కంట్రోల్‌ చేయగలిగే పనోరమిక్‌ సన్‌రూఫ్, మూడ్‌ లైటింగ్‌ ద్వారా పనిచేసే పవర్డ్‌ టెయిల్‌గేట్, 500 లీటర్ల సామర్థ్యం గల పెద్ద బూట్‌ స్పేస్‌ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 31.24 అంగుళాల సినిమాటిక్‌ టచ్‌స్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, 9 స్పీకర్‌ జేబీఎల్‌ సౌండ్‌ సిస్టమ్‌లున్నాయి. కర్వ్‌ పెట్రోల్‌/డీజిల్, ఎలక్ట్రిక్‌ పవర్‌ట్రైన్లలో లభిస్తుంది.

ఈ కారు 1.2 లీటర్‌ హైపీరియన్‌ పెట్రోల్‌ డైరెక్ట్‌ ఇంజెక్షన్, రొవొట్రాన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ , 1.5 లీటర్‌ క్రయోజెంట్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో వస్తాయి. లెవెల్‌–2 ఏడీఏఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్స్‌)తో వస్తాయి. ఇది 5–స్టార్‌ భారత్‌ ఎన్‌సీఏపీ భద్రతా రేటింగ్‌ను పొందింది. ప్రీమియం ఎగ్జిక్యూటివ్‌ ఫీచర్లు జోడించినప్పటికీ, కర్వ్‌ ధరలు అందుబాటులోనే ఉన్నాయి. కర్వ్‌ అకెంప్లిష్డ్‌ వేరియంట్‌ రూ.14.55 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. కర్వ్‌ ఈవీ అకెంప్లిష్డ్‌, ఎంపవర్డ్‌ వేరియంట్లు రూ.18.49 లక్షల ప్రారంభ ధరతో లభిస్తాయి.

ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement