
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన 'టీవీఎస్ ఎన్‌టార్క్ 125' మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ స్కూటర్ ఇటీవల 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
2025 మే 4న నోయిడాలోని సెక్టార్-38 నుంచి ప్రారంభమైన రైడ్‌ను ప్రారంభించి 15 గంటల్లోపు దాదాపు 1000 కి.మీ. రైడ్‌ను పూర్తి చేసి, మొదటి రికార్డును బద్దలు కొట్టింది. ఆ తరువాత కొందరు రైడర్లు.. కేవలం 24 గంటల్లో 1618 కిమీ దూరాన్ని ఈ స్కూటర్‌పై ప్రయాణించి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ స్కూటర్ ఢిల్లీ-ఆగ్రా, ఆగ్రా-లక్నో & లక్నో-అజమ్‌గఢ్‌లతో సహా మల్టిపుల్ ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించింది.
రైడింగ్ కోసం ఉపయోగించిన వేరియంట్స్ టాప్ ఎండ్ వేరియంట్స్ అయిన.. ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ, డిస్క్, రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్, ఎక్స్‌టీ ఉన్నాయి. పర్ఫామెన్స్ బేస్డ్ స్కూటర్ ధరలు రూ. 87542 నుంచి రూ. 1.07 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.
ఇదీ చదవండి: రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ 125 సీసీ ఇంజిన్ ద్వారా 10 Bhp పవర్ 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 95 కిమీ/గం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.