
న్యూఢిల్లీ: కస్టమర్లకు క్లౌడ్ స్టోరేజీ ప్రయోజనాలను అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్‌తో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందం ప్రకారం ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లందరికీ ఆరు నెలల పాటు 100 జీబీ మేర గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసు ఉచితంగా లభిస్తుంది. దీన్ని మరో అయిదుగురితో షేర్ చేసుకోవచ్చు. 6 నెలల ఉచిత వ్యవధి పూర్తయిన తర్వాత నుంచి నెలకు రూ. 125 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
డివైజ్‌లలో డేటా స్టోరేజ్ పరిమితుల వల్ల మాటిమాటికీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో క్లౌడ్ స్టోరేజీ ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది.