
సాధారణంగా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకుంటే.. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేదా ఆ కంపెనీకి చెందిన రిక్రూటర్ కాల్ చేయడం జరుగుతుంది. అయితే ఓ అభ్యర్థి.. తనకు పదేపదే కాల్స్ వస్తున్నాయని, ఏకంగా ఒక గ్లోబల్ కంపెనీ ఇంటర్వ్యూనే వద్దనుకున్నాడు. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేను ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకున్నాను అనే శీర్షికతో.. ఓ రెడ్డిట్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో.. సోమవారం నుంచి బుధవారం మధ్య, రిక్రూటర్ నాలుగు ఈమెయిల్స్ పంపారు, 15 ఫోన్ కాల్స్ చేశారు. 45 టెక్స్ట్ మెసేజస్ చేశారు. కొన్ని మెసేజస్ రాత్రి 10 గంటల సమయంలో కూడా వచ్చాయి. అప్పటికే రిక్రూటర్‌తో మూడుసార్లు మాట్లాడాను, అవసరమైన మొత్తం సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా షేర్ చేశాను. నేను బిజీగా ఉన్నప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి నాకు వచ్చిన ఫోన్ నెంబరుకు తిరిగి కాల్ చేస్తే.. మరెవరో సమాధానం ఇచ్చారు. దీంతో నాకు వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది.

వాళ్ళ ప్రవర్తనతో ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకోవాలనిపించింది. ఆ తరువాత నేరుగా ఇంటర్వ్యూ చేసేవారికి ఈ మెయిల్ చేసాను. రిక్రూటర్‌ను బ్లాక్ చేయడానికి ముందు కూడా నాకు రెండు కాల్స్ వచ్చాయని ఆ ఉద్యోగార్థి (అభ్యర్థి) పేర్కొన్నారు. వల్ల ప్రవర్తన నన్ను అతిపెద్ద కంపెనీలలో ఒకదానికి పూర్తిగా దూరం చేసిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రిక్రూటర్ మోసగాడేమో అని ఒకరు సందేహపడగా.. వారు రిక్రూటర్‌గా కాకుండా టెలిమార్కెటర్‌గా ఉండి ఉంటే బాగుండేదని మరొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక