
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 108 పాయింట్లు పెరిగి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 364 ప్లాయింట్లు ఎగబాకి 81,560 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.38 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.39 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.38 శాతం పడిపోయింది.
ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా ఇటీవల 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్‌లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)