
డీబీర్స్ గ్రూప్ సీఈవో కుక్
ఫరెవర్ మార్క్‌బ్రాండ్ విడుదల
ముంబై: భారత్‌లో వజ్రాల వినియోగం 2030 నాటికి రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్టు డీబీర్స్ గ్రూప్ (డైమండ్ కంపెనీ) సీఈవో అల్‌కుక్ తెలిపారు. భారత్‌లో ఫరెవర్‌మార్క్ బ్రాండ్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సహజ వ్రజాభరణాలకు భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద మారెŠక్‌ట్‌గా ఉన్నట్టు తెలిపారు. గతేడాది చైనాను అధిగమించినట్టు చెప్పారు. ఏటా 12 శాతం చొప్పున డిమాండ్ పెరుగుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌తో సహజ వజ్రభరణాల డిమాండ్ 10 బిలియన్ డాలర్లలోపు ఉన్నట్టు చెప్పారు.
భవిష్యత్ వృద్ధి పట్ల ఆశావహంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ ముంబైలో రెండు చొప్పున మొత్తం నాలుగు ఫరెవర్‌మార్క్ స్టోర్లను తెరవనున్నట్టు.. వచ్చే ఐదేళ్లలో 100 స్టోర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. కంపెనీ సొంత స్టోర్లతోపాటు, ఫ్రాంచైజీ రూపంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల పరిధిలో ఇవి ఉంటాయన్నారు. ఫరెవర్‌మార్క్ బ్రాండ్‌కు ఓమ్నిఛానల్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) విధానం అనుసరిస్తామని డీబీర్స్ ఇండియా ఎండీ అమిత్ ప్రతిహారి తెలిపారు. ‘‘ఈ కామర్స్‌తోపాటు స్టోర్లను కూడా తెరుస్తున్నాం. భౌతిక స్టోర్ల అందుబాటు కూడా కీలకమే’’అని చెప్పారు.
ఎల్‌జీడీలకు భవిష్యత్
ల్యాబ్ గ్రోన్ వజ్రాలకు (ఎల్‌జీడీ) వాణిజ్య పరంగా భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు కుక్ చెప్పారు. ఎల్‌జీడీల టోకు ధరలు 90 శాతం వరకు పడిపోయినట్టు తెలిపారు. ‘‘సహజ వజ్రాలు–ఎల్‌జీడీలకు మధ్య వ్యత్యాసంపై వినియోగదారుల్లో అవగాహన కలి్పస్తాం. దీంతో ఈ రెండింటి మధ్య తేడా చెప్పలేరన్న అపోహ తొలగిపోతుంది. వజ్రం ధ్రువీకరణ ప్రభావం ఇక మీదట పెరిగేదే’’అని వివరించారు. భారత్‌లో సహజ వజ్రాలకున్న డిమాండ్ నేపథ్యంలో మార్కెటింగ్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కుక్ తెలిపారు. సజహ వజ్రాలను టారిఫ్ పరిధి నుంచి అమెరికా మినహాయిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో సహజ వజ్రాల గనులు లేకపోవడంతో అక్కడ ఉత్పత్తికి అవకాశం లేదన్నారు.