టెక్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా? | Meet, Tesla CFO Vaibhav Taneja Who Earns More Than Sundar Pichai And Satya Nadella, Check Here How Much He Earned | Sakshi
Sakshi News home page

గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?

May 22 2025 3:00 PM | Updated on May 22 2025 3:31 PM

Tesla CFO Vaibhav Taneja Earns More Than Sundar Pichai And Satya Nadella Check Here How Much He Earned

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'వైభవ్ తనేజా' భారీ సంపాదన పొంది వార్తల్లో నిలిచారు. 2024లో ఈయన సంపాదన ఏకంగా 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11.94 వేలకోట్ల కంటే ఎక్కువ). ఇది మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'.. గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్'ల కంటే చాలా ఎక్కువ.

2024లో సుందర్ పిచాయ్ సంపాదన 10.73 మిలియన్ డాలర్లు కాగా, సత్యనాదెళ్ళ సంపాదన 79.106 డాలర్లు. దీన్ని బట్టి చూస్తే.. వైభవ్ తనేజా సంపాదన (139.5 మిలియన్ డాలర్లు) చాలా ఎక్కువ అని స్పష్టమవుతోంది. అంతకు ముందు 2020లో నికోలాకు చెందిన కిమ్ బ్రాడీ 80.6 మిలియన్ డాలర్ల సంపాదనతో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దీనిని వైభవ్ అధిగమించారు.

ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

టెస్లాలో తనేజా బేసిక్ శాలరీ 400000 డాలర్లు (రూ. 3.4 కోట్లు). అయితే స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ వంటి ఇతర ప్రయోజనాల కారణంగా ఈయన సంపాదన గణనీయంగా పెరిగింది.

ఎవరీ వైభవ్ తనేజా?
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసిన వైభవ్ తనేజా.. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ అండ్ రిటైల్ రంగాలకు సంబంధించిన మల్టిపుల్ కంపెనీలలో 17 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఈయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీని కూడా పూర్తి చేశారు. 2017లో టెస్లా కంపెనీలో కార్పొరేట్ కంట్రోలర్‌గా.. చేరిన వైభవ్ తనేజా సీఎఫ్ఓ వరకు ఎదిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement