breaking news
Vaibhav Taneja
-
టెక్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'వైభవ్ తనేజా' భారీ సంపాదన పొంది వార్తల్లో నిలిచారు. 2024లో ఈయన సంపాదన ఏకంగా 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11.94 వేలకోట్ల కంటే ఎక్కువ). ఇది మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'.. గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్'ల కంటే చాలా ఎక్కువ.2024లో సుందర్ పిచాయ్ సంపాదన 10.73 మిలియన్ డాలర్లు కాగా, సత్యనాదెళ్ళ సంపాదన 79.106 డాలర్లు. దీన్ని బట్టి చూస్తే.. వైభవ్ తనేజా సంపాదన (139.5 మిలియన్ డాలర్లు) చాలా ఎక్కువ అని స్పష్టమవుతోంది. అంతకు ముందు 2020లో నికోలాకు చెందిన కిమ్ బ్రాడీ 80.6 మిలియన్ డాలర్ల సంపాదనతో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దీనిని వైభవ్ అధిగమించారు.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికటెస్లాలో తనేజా బేసిక్ శాలరీ 400000 డాలర్లు (రూ. 3.4 కోట్లు). అయితే స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ వంటి ఇతర ప్రయోజనాల కారణంగా ఈయన సంపాదన గణనీయంగా పెరిగింది.ఎవరీ వైభవ్ తనేజా?ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసిన వైభవ్ తనేజా.. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ అండ్ రిటైల్ రంగాలకు సంబంధించిన మల్టిపుల్ కంపెనీలలో 17 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఈయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీని కూడా పూర్తి చేశారు. 2017లో టెస్లా కంపెనీలో కార్పొరేట్ కంట్రోలర్‌గా.. చేరిన వైభవ్ తనేజా సీఎఫ్ఓ వరకు ఎదిగారు. -
టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు
Tesla new Indian-origin CFO VaibhavTaneja ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ అధీనంలోని ఆటో మేజర్ టెస్లాకు సీఎఫ్‌వోగా భారత సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు. జాచరీ కిర్‌ఖోర్న్ స్థానంలో భారతీయ సంతతికి చెందిన అకౌంటింగ్ హెడ్ వైభవ్ తనేజాను నియమించినట్లు సంస్థ ప్రకటించింది. తనేజా ఢిల్లీ యూనివర్సిటీ నుండి కామర్స్ గ్రాడ్యుయేట్. రెండు దశాబ్దాలకు పైగా అకౌంటింగ్ అనుభవం ఉంది.దీంతోపాటుటెక్నాలజీ ఫైనాన్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్‌లో పలు బహుళజాతి కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం వైభవ్ సొంతం. (నిన్న బియ్యం ఎగుమతులపై నిషేధం: నెక్ట్స్ ఏంటో తెలిస్తే..!) అమెరికన్ ఆటోమొబైల్ మేజర్ టెస్లాలో ప్రస్తుతం చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైభవ్ తనేజాకు అదనపు బాధ్యతగా సీఎఫ్‌వో బాధ్యతలు అప్పగించారు.అయితే ఈ మార్పునకు గల కారణాలను కంపెనీ అధికారికంగా ప్రకటించారు. కానీ సజావుగా పరివర్తనను నిర్ధారించేందుకుగాను సంవత్సరం చివరి వరకు అతని స్థానంలో ఉంటారని ఈ ఏడాది చివరి వరకు జాచరీ కిర్ఖోర్న్ఈ పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది. "మాస్టర్ ఆఫ్ కాయిన్" గా పాపులర్ అయిన వైభవ తనేజా గురించి ఆసక్తికర విషయాలు: ఎవరీ వైభవ్ ♦ వైభవ్ తనేజా 2017లో టెస్లాలో చేరారు, 2016లో టెస్లా కొనుగోలు చేసిన సోలార్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థ సోలార్‌సిటీలో వైస్ ప్రెసిడెంట్‌గా , తరువాత కార్పొరేట్ కంట్రోలర్‌గా పనిచేశారు. 2016లో దీన్ని టెస్లా టేకోవర్ చేసింది. ఈ విలీనంలోరెండు కంపెనీల అకౌంటింగ్ బృందాల విజయవంతమైన ఏకీకరణకు కూడా నాయకత్వం వహించారు. వైభవ్ మార్చి 2019 నుండి టెస్లా సీఏవోగా పనిచేస్తున్నారు. అలాగే మే 2018 నుండి కంపెనీ కార్పొరేట్ కంట్రోలర్‌గా కూడా పనిచేస్తున్నారు. (అయ్యయ్యో..దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది) ♦ 13 సంవత్సరాలు పాటు సంస్థకు సేవలందించిన జాచరీ కిర్‌ఖోర్న్ స్థానంలో వైభవ్ తనేజాకొత్త సీఎఫ్‌వోగా ఎంపికయ్యారు. ♦ టెస్లా త్రైమాసిక ఆదాయాలు , అమెరికా, అంతర్జాతీయ నియంత్రణపై తనేజా మాజీ సీఎఫ్ఓలు దీపక్ అహుజా , జాచరీ కిర్ఖోర్న్లకు సన్నిహితుడు. ♦ తనేజా జనవరి 2021లో టెస్లా ఇండియన్ ఆర్మ్, టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా కూడా నియమితులయ్యారు. కాగా భారత మార్కెట్లో ఎగుమతి రెండింటి కోసం టెస్లా ప్రస్తుత ఎంట్రీ మోడల్ కంటే దాదాపు 25శాతం తక్కువ ధరతో ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని భారతదేశంలో నిర్మించాలని టెస్లా భారీ ప్రయత్నాలే చేస్తోంది. ఈ వార్తల మధ్య ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి తోడు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమైనట్టు తెలుస్తోంది. టెస్లా సీనియర్ పబ్లిక్ పాలసీ , బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోహన్ పటేల్, సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ రోషన్ థామస్‌తో భేటీ అయ్యారు.