
మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటారా? అందులోనూ వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారా? అయితే మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన అప్డేట్ ఒకటి ఉంది. ఇండియన్ రైల్వే తాజాగా ఒక పెద్ద మార్పు చేసింది. స్లీపర్ క్లాస్ టికెట్లు ఇకపై ఖాళీగా ఉన్నప్పటికీ ఫస్ట్ ఏసీకి అప్‌గ్రేడ్ అవ్వవు. ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు ఒక వేళ సీట్లు అందుబాటులో ఇతర క్లాస్‌లలో సీట్లు కేటాయించేవారు. ఇకపై ఆ సౌకర్యం ఉండదు.
ఆటో అప్‌గ్రేడ్ విధానం ఎలా పనిచేస్తుందో తాజగా జారీ చేసిన సర్క్యులర్‌లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది. మీరు ఒక నిర్దిష్ట తరగతిలో టికెట్ బుక్ చేసుకుంటే అందులో సీట్లు అందుబాటులో లేకపోతే మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. ఒకవేళ ఇతర ఉన్నత తరగతులలో లభ్యత ఉంటే మీ సీటు ఆటోమేటిక్‌గా ఆ క్లాస్‌లోకి అప్‌గ్రేడ్ అవుతుంది. అయితే ఇది రెండు తరగతులకు మాత్రమే.
సీట్ల అప్‌గ్రేడ్ ఇలా..
స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, అప్‌గ్రేడ్ కొత్త క్రమం ఇలా ఉంటుంది..
2S → 3E → 3A → 2A → 1A
అయితే 2ఏ ప్రయాణీకులను మాత్రమే 1ఏ (ఫస్ట్ ఏసీ)గా అప్ గ్రేడ్ చేయవచ్చని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. మీరు స్లీపర్ లేదా 3ఈలో ఉంటే ఇకపై ఫస్ట్ ఏసీకి అప్‌గ్రేడ్ కాలేరు.
సీటింగ్ క్లాస్ కోచ్‌లతో అప్‌గ్రేడ్ క్రమం ఇలా ఉంటుంది..
2S → VS → CC → EC → EV → EA
ఇక్కడ కూడా సీసీ (చైర్ కార్) టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈసీ, ఈవీ లేదా ఈఏ వంటి ప్రీమియం తరగతులకు అప్ గ్రేడ్ అయ్యేందుకు అర్హులు. అలాగే సీటింగ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌లకు మధ్య ఎలాంటి అప్‌గ్రేడ్‌కు అవకాశం ఉండదు.
అప్‌గ్రేడ్ కోసం ఏమైనా చేయాలా?
ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ‘ఓకే విత్ ఆటో అప్‌గ్రేడ్’ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ "యస్" క్లిక్ చేస్తే, మీ టిక్కెట్ అర్హత అప్‌గ్రేడ్‌కు పొందుతుంది. "నో" ఎంచుకుంటే, అప్‌గ్రేడ్ కాదు. ఒక వేళ మీరు ఏ ఆప్షన్‌నూ ఎంచుకోకపోతే సిస్టమ్ దానిని డిఫాల్ట్‌గా "యస్" గా తీసుకుంటుంది.