బజాజ్‌ ఆటో చేతికి కేటీఎమ్‌ | Bajaj Auto acquire majority stake in Austrian bike maker KTM | Sakshi
Sakshi News home page

బజాజ్‌ ఆటో చేతికి కేటీఎమ్‌

May 23 2025 6:24 AM | Updated on May 23 2025 7:35 AM

Bajaj Auto acquire majority stake in Austrian bike maker KTM

మెజారిటీ వాటా కొనుగోలుకి రెడీ 

రూ. 7,765 కోట్ల పెట్టుబడులకు సై 

న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్‌ ఆటో తాజాగా ఆ్రస్టియన్‌ బైక్‌ తయారీ కంపెనీ కేటీఎమ్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు వీలుగా సొంత అనుబంధ సంస్థ బజాజ్‌ ఆటో ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ బీవీ ద్వారా ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న కేటీఎమ్‌కు డెట్‌ ఫండింగ్‌ ప్యాకేజీ ద్వారా 80 కోట్ల యూరోలు(సుమారు రూ. 7,765 కోట్లు) అందించనుంది. వెరసి కేటీఎమ్‌లో మైనారిటీ వాటాదారు స్థాయినుంచి మెజారిటీ (యాజమాన్య) సంస్థగా అవతరించనున్నట్లు బజాజ్‌ ఆటో తాజాగా వివరించింది. సంయుక్త డెవలప్‌మెంట్‌ పథకంలో భాగంగా కేటీఎమ్‌ బిజినెస్‌ను పట్టాలెక్కించనున్నట్లు తెలియజేసింది.

 అభివృద్ధి, తయారీ, అమ్మకాలు చేపట్టడం ద్వారా భారత్‌సహా 80 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించింది. డెట్‌ ఫండింగ్‌ ప్యాకేజీలో భాగంగా ఆ్రస్టియన్‌ కోర్టు ఆదేశాల ప్రకారం రుణదాతలకు తగినస్థాయిలో చెల్లింపులతోపాటు కంపెనీ కార్యకలాపాల పునరుద్ధరణకు నిధులు అందించనున్నట్లు వివరించింది. ఇప్పటికే 20 కోట్ల యూరోలు విడుదల చేయగా.. మిగిలిన 60 కోట్ల యూరోలను అందించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ కేటీఎమ్, హస్వానా, గస్‌గస్‌ పేరుతో సుప్రసిద్ధ మోటార్‌సైకిళ్ల బ్రాండ్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కేటీఎమ్‌ ఏజీ హోల్డింగ్‌ సంస్థ పీరర్‌ మొబిలిటీ ఏజీ(పీఎంఏజీ)కాగా.. తాజా లావాదేవీకి ముందు పీఎంఏజీ/కేటీఎమ్‌లో బజాజ్‌ ఆటో 37.5 శాతం వాటాను కలిగి ఉంది.  

బీఎస్‌ఈలో బజాజ్‌ ఆటో షేరు  0.5 శాతం బలపడి రూ. 8,734 వద్ద ముగిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement