Austrian sports bike
-
బజాజ్ ఆటో చేతికి కేటీఎమ్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా ఆ్రస్టియన్ బైక్ తయారీ కంపెనీ కేటీఎమ్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు వీలుగా సొంత అనుబంధ సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీ ద్వారా ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న కేటీఎమ్‌కు డెట్ ఫండింగ్ ప్యాకేజీ ద్వారా 80 కోట్ల యూరోలు(సుమారు రూ. 7,765 కోట్లు) అందించనుంది. వెరసి కేటీఎమ్‌లో మైనారిటీ వాటాదారు స్థాయినుంచి మెజారిటీ (యాజమాన్య) సంస్థగా అవతరించనున్నట్లు బజాజ్ ఆటో తాజాగా వివరించింది. సంయుక్త డెవలప్మెంట్ పథకంలో భాగంగా కేటీఎమ్ బిజినెస్‌ను పట్టాలెక్కించనున్నట్లు తెలియజేసింది. అభివృద్ధి, తయారీ, అమ్మకాలు చేపట్టడం ద్వారా భారత్‌సహా 80 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించింది. డెట్ ఫండింగ్ ప్యాకేజీలో భాగంగా ఆ్రస్టియన్ కోర్టు ఆదేశాల ప్రకారం రుణదాతలకు తగినస్థాయిలో చెల్లింపులతోపాటు కంపెనీ కార్యకలాపాల పునరుద్ధరణకు నిధులు అందించనున్నట్లు వివరించింది. ఇప్పటికే 20 కోట్ల యూరోలు విడుదల చేయగా.. మిగిలిన 60 కోట్ల యూరోలను అందించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ కేటీఎమ్, హస్వానా, గస్గస్ పేరుతో సుప్రసిద్ధ మోటార్‌సైకిళ్ల బ్రాండ్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కేటీఎమ్ ఏజీ హోల్డింగ్ సంస్థ పీరర్ మొబిలిటీ ఏజీ(పీఎంఏజీ)కాగా.. తాజా లావాదేవీకి ముందు పీఎంఏజీ/కేటీఎమ్‌లో బజాజ్ ఆటో 37.5 శాతం వాటాను కలిగి ఉంది. బీఎస్ఈలో బజాజ్ ఆటో షేరు 0.5 శాతం బలపడి రూ. 8,734 వద్ద ముగిసింది. -
కేటీఎం డ్యూక్ బైక్‌ల్లో బీఎస్–ఫోర్ రకాలు
⇒ డ్యూక్ 390 బైక్ ధర రూ.2,25,730 ⇒ డ్యూక్ 250 బైక్ ధర రూ.1,73,000 ⇒ డ్యూక్ 200 బైక్ ధర రూ.1,43,500 ముంబై: ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కేటీఎం... డ్యూక్ మోడళ్లలో భారత్ స్టేజ్ ఫోర్(బీఎస్–ఫోర్) వేరియంట్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కేటీఎం బ్రాండ్‌లో బజాజ్ ఆటో కంపెనీకి 49 శాతం వాటా ఉంది. డ్యూక్ 390, డ్యూక్ 250, డ్యూక్ 200 మోడళ్లలో ఈ బీఎస్–ఫోర్ వేరియంట్లను ప్రవేశపెడుతున్నామని ప్రోబైకింగ్ (బజాజ్ ఆటో స్పోర్ట్స్ బైక్స్ డివిజన్) ప్రెసిడెంట్ అమిత్ నంది చెప్పారు. అయితే వీటి ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. డ్యూక్ 390 బైక్ ధర రూ.2,25,730 అని, డ్యూక్ 250 బైక్ ధర రూ.1,73,000 అని, డ్యూక్ 200 బైక్ ధర రూ.1,43,500 (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)అని వివరించారు. డ్యూక్ 200 బైక్ ఇప్పటికే డీలర్ల వద్ద లభ్యమవుతోందని, మరో రెండు వారాల్లో మిగిలిన బైక్‌లు మార్కెట్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 325గా ఉన్న షోరూమ్‌ల సంఖ్యను విస్తరించనున్నట్లు వివరించారు.