
రేంజ్ రోవర్ రణథంబోర్ స్పెషల్ ఎడిషన్ మంచి ఆదరణ పొందటంతో.. కంపెనీ ఇప్పుడు మరో స్పెషల్ ఎడిషన్‌ను 'హిమాలయన్' పేరుతో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది లేత పెయింట్ షేడ్స్ పొందనున్నట్లు సమాచారం.
రేంజ్ రోవర్ హిమాలయన్ ఎడిషన్ గురించి కంపెనీ చాలా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది ఇప్పుడున్న అన్ని ఎడిషన్స్ కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ఎన్ని యూనిట్లకు పరిమితం చేసింది. ఎప్పటి నుంచి విక్రయిస్తుందనే విషయాలను కూడా వెల్లడించలేదు.
స్పెషల్ ఎడిషన్లకు డిమాండ్ పెరగడంతో.. హిమాలయన్ ఎడిషన్స్ లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు.. జేఎల్ఆర్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ లింపెర్ట్ పేర్కొన్నారు. కస్టమర్లు మరిన్ని స్పెషల్ ఎడిషన్స్ కోరుకుంటున్నారు. కాబట్టి మేము మరో మోడల్ ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాకు సింగర్ ట్వీట్: సాయం చేయండి అంటూ..
గతంతో పోలిస్తే.. రేంజ్ రోవర్ కార్లు మంచి అమ్మకాలను పొందుతున్నాయి. గడచిన ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో లగ్జరీ విభాగంలో మూడో స్థానానికి చేరింది. రేంజ్ రోవర్ & రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క స్థానిక అసెంబ్లీ మోడళ్ల అమ్మకాలు 2.5 రెట్లు పెరిగాయి.