
ఇండియన్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. సేఫ్టీ, దృఢమైన నిర్మాణం వంటి కారణాల వల్ల ఎక్కువ మంది ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడుతుంటారు. కానీ.. పంజాబీ సింగర్ అండ్ యాక్టర్ 'గిప్పీ గ్రెవాల్' (Gippy Grewal) మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు.
నిరాశ కలిగించే ఎక్స్‌పీరియన్స్ అంటూ.. ''దయచేసి సాయం చేయండి అని మహీంద్రా రైస్, ఆనంద్ మహీంద్రాలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. నా టీమ్ కోసం రెండు స్కార్పియో ఎన్ కార్లను కొనుగోలు చేసాను. అయితే వాటిలో ఎప్పుడూ టెక్నీకల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూనే ఉన్నాయి. డీలర్‌షిప్ సిబ్బంది కూడా సరైన పరిష్కారం చూపించడం లేదు'' అని రెండు స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు.
నేను ఇండియన్ బ్రాండ్‌కు పెద్ద అభిమానిని. ఈ కారణం చేతనే రెండు 'స్కార్పియో ఎన్' కార్లను కొనుగోలు చేసాను. కార్లలో సమస్యలు తలెత్తినప్పుడు.. సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తే, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సర్వీస్ సెంటర్‌కు వాహనాలు ఎన్నిసార్లు వచ్చాయో చూపించడానికి డీలర్‌షిప్ తమ వాహనాల ఎంట్రీ & ఎగ్జిట్ లాగ్‌ల కాపీని ఇవ్వడానికి కూడా నిరాకరించిందని సింగర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
మొదటి వాహనంలో.. ఎల్ఈడీ డీఆర్ఎల్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ బ్లింక్ అవుతుంది, తరచుగా ఫోన్ నుంచి డిస్‌కనెక్ట్ అవుతుంది. డీలర్‌షిప్ ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. రెండవ వాహనం కూడా ఇలాంటి సమస్యలే.. బూట్ స్పేస్ కూడా సమస్య కూడా ఉంది. ఇది తయారీ లోపం కావచ్చని గిప్పీ గ్రేవాల్ మెయిల్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందించలేదు. తప్పకుండా తగిన పరిష్కారం చూపించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
Disappointing experience @MahindraRise @anandmahindra, please help, Bought 2 Scorpio-Ns for my team, but facing persistent tech issues & poor dealership experience. Requesting immediate resolution & investigation into Raj Vehicles, Mohali. @MahindraScorpio
Mail Screenshot… pic.twitter.com/TJ7ZVWDPbs— Gippy Grewal (@GippyGrewal) May 23, 2025