‘ఆర్టిఫిషియల్‌’ మూవీ.. ఎవరి గురించి అంటే.. | Luca Guadagnino set to direct Artificial OpenAI leadership crisis | Sakshi
Sakshi News home page

‘ఆర్టిఫిషియల్‌’ మూవీ.. ఎవరి గురించి అంటే..

Jun 4 2025 4:58 PM | Updated on Jun 4 2025 5:30 PM

Luca Guadagnino set to direct Artificial OpenAI leadership crisis

ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను నాటకీయంగా తొలగించి 2023 చివరిలో తిరిగి కంపెనీ సీఈఓగా నియమించుకున్న ఘట్టాన్ని ఫీచర్ ఫిల్మ్‌ ‘ఆర్టిఫిషియల్‌’ను తెరకెక్కించేందుకు ఫిల్మ్ మేకర్ లూకా గ్వాడాగ్నినో చర్చలు జరుపుతున్నారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని హేడే ఫిల్మ్స్ పతాకంపై డేవిడ్ హేమన్, జెఫ్రీ క్లిఫోర్డ్ నిర్మించాలని చూస్తున్నారు. నిర్మాతగా వ్యవహరిస్తున్న సైమన్ రిచ్ స్క్రీన్ ప్లే కూడా అందించాలనుకుంటున్నారు. జెన్నిఫర్ ఫాక్స్ సంస్థ నిర్మాణ బృందంలో చేరడానికి చర్చలు జరుపుతోంది.

ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం శాన్‌ఫ్రాన్సిస్కో, ఇటలీని కీలక షూటింగ్‌ ప్రాంతాలుగా గుర్తించారు. సమ్మర్ షూట్ కోసం చర్చలను వేగవంతం చేస్తున్నారు. కాస్టింగ్ ఒప్పందాలు ఏవీ ఇప్పటివరకు ఖరారు కానప్పటికీ, ప్రారంభ చర్చల ప్రకారం ఆల్టమన్‌ పాత్రను ఆండ్రూ గార్ఫీల్డ్ పోషించవచ్చని, మోనికా బార్బరో కంపెనీ సీటీఓ మీరా మురాటి పాత్రను పోషించవచ్చని అంచనా వేస్తున్నారు. ఆల్ట్‌మన్‌ను తొలగించే ప్రయత్నానికి నాయకత్వం వహించిన సహవ్యవస్థాపకురాలు ఇలియా సుట్స్కేవర్ పాత్రలో యురా బోరిసోవ్ నటించవచ్చని చెబుతున్నారు.

తొలగింపునకు కారణం ఇదే..

ఓపెన్‌ ఏఐ(OpenAI) సంస్థ సామ్‌ ఆల్ట్‌మన్‌ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్‌ ఆర్థిక సహకారం ఉన్న కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే సీఈఓగా తొలగించడానికి ప్రధాన కారణమని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా.. ఆల్ట్‌మన్‌ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్‌ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదని కంపెనీ వెల్లడించింది.

ఇదీ చదవండి: ‘ఎక్స్‌ చాట్‌’ ప్రారంభించిన మస్క్‌

దాంతో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న సామ్‌ ఆల్ట్‌మన్‌ను తిరిగి అదే పదవిలోకి తీసుకుంటున్నట్లు ఓపెన్‌ఏఐ మళ్లీ ప్రకటించింది. తనను తొలగించిన కంపెనీ బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని సామ్‌ పెట్టిన షరతుకు ఓపెన్‌ఏఐ ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement