
భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే చాలానే యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో దేని ప్రత్యేకత దానిదే. అయినప్పటికీ రైల్వేశాఖ మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసిన ‘స్వరైల్ యాప్’ ఆన్‌లైన్ రైల్వే సేవలను క్రమబద్ధీకరించడానికి ఆల్-ఇన్-వన్ రైల్వే సర్వీసులకు వేదికగా నిలుస్తుందని తెలిపింది. ఇది బహుళ రైల్వే సేవలను ఒకే యాప్‌లో ఏకీకృతం చేస్తుందని పేర్కొంది. స్వరైల్ యాప్‌లో అందిస్తున్న కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
టికెట్ బుకింగ్: ప్లాట్‌ఫామ్ టికెట్లతో సహా రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్ టికెట్లను నేరుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
పీఎన్ఆర్, ట్రైన్ స్టేటస్ ట్రాకింగ్: రైలు షెడ్యూళ్లు, ఆలస్యం, ప్లాట్‌ఫామ్ నంబర్లకు సంబంధించి రియల్ టైమ్ అప్‌డేట్లను పొందవచ్చు.
రైళ్లలో ఫుడ్ ఆర్డర్లు: రైళ్లలో ఆన్‌లైన్‌లోనే భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా మీ సీటు వద్దకే భోజనం డెలివరీ చేస్తారు.
రైల్ మదద్ (కంప్లైంట్ మేనేజ్‌మెంట్): రైలు ప్రయాణంలో మీ సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. చేసిన ఫిర్యాదు, దాని పరిష్కారాన్ని రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు.
ఇదీ చదవండి: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు రిలయన్స్ ఏర్పాట్లు
పార్సిల్, ఫ్రైట్ ఎంక్వైరీ: సరుకు రవాణాను నిర్వహించవచ్చు. పార్సిళ్లను ట్రాక్ చేయడం, సరుకు రవాణా ఖర్చులను లెక్కించడం.
కోచ్ పొజిషన్ ఫైండర్: రైలు ఎక్కే సమయంలో కచ్చితంగా ఏ పొజిషన్‌లో మీరు ఎక్కబోయే కోచ్ నిలుస్తుందో తెలుసుకోవచ్చు.
రీఫండ్ అభ్యర్థనలు: రద్దు అయిన, మిస్ అయిన ప్రయాణాల కోసం మీ చెల్లింపులపై సులభంగా రీఫండ్‌లను పొందేందుకు అభ్యర్థనలు పెట్టుకోవచ్చు.
ఇతర భాషలు: ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్‌తోపాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.
ఆర్-వాలెట్ ఇంటిగ్రేషన్: టికెట్లు, భోజనం, ఇతర సేవల కోసం సురక్షితమైన, నగదు రహిత చెల్లింపుల కోసం ఆర్-వాలెట్ ఉపయోగించవచ్చు.