
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్.. టైమ్ మ్యాగజైన్ టాప్–100 దాతృత్వ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. విభిన్న కార్పొరేట్ వ్యవస్థాపకులు, దాతృత్వవాదులు సామాజిక అవసరాలకు నిధులు ఎలా కేటాయించిస్తున్నారో ఇది తెలియజేస్తుందని టైమ్ మ్యగజైన్ పేర్కొంది.
ఇదీ చదవండి: పక్క దేశంలో స్టార్‌లింక్ పాగా
దేశంలో అత్యధికంగా ముకేశ్, నీతా అంబానీ 2024లో రూ.407 కోట్లను విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ 2013లో విప్రో కంపెనీలోని 29 బిలియన్ డాలర్ల షేర్లను విరాళంగా ప్రకటించడాన్ని గుర్తు చేసింది. సంప్రదాయ విరాళానికి అదనంగా విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో సేవలు అందించే 940 సంస్థలకు ప్రేమ్‌జీ 2023–2024 సంవత్సరాల్లో 109 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. 2023లో జెరోదా నిఖిల్ కామత్, నితిన్ కామత్ తమ సంపదలో 25 శాతాన్ని సమాజం కోసం ప్రకటించడాన్ని టైమ్ మ్యాగజైన్ గుర్తుచేసింది.