
కొందరు సమస్యలను చూసి పెద్దగా టెన్షన్ పడరు. వాటిని తేలికగా ఎదుర్కొని పరిష్కరిస్తారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా అనుకుంటారు. అటువంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఐదు విషయాలను తప్పక తెలుసుకోవాలి.
ఎవరైనా తెలివితేటలను ఉపయోగించి సమస్య నుంచి బయటపడితే వారిని అపర చాణక్యుడు అని అంటాం. ఎందుకంటే భారతీయులలో చాణక్యుడికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే చాణక్యుడు గొప్ప సలహాదారు, వ్యూహకర్త, తత్వవేత్త. అలాగే వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉన్నవాడు. ఆయన జీవితంలో ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని నీతి సూత్రాలు బోధించాడు. అందులో కష్టాల్లో ఉన్నపుడు ఎలా మసులుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
పక్కా ప్లానింగ్...
ఎవరినైనా సరే, సమస్యలు, సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటినుంచి తప్పించుకుని తిరగాలని చూడకూడదు. వాటిని ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకుని ఉండాలి. అప్పటికప్పుడు ఆలోచించడం కాకుండా తగిన ప్లానింగ్‌తో ఉంటే ఆ సమస్య నుంచి తేలికగా బయటపడగలరు.
సంసిద్ధత...
చాణక్యుడు ఏం చెబుతాడంటే ఎవరైనా సరే, కష్టాలు వచ్చినప్పుడు బెంబేలత్తకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని కష్టాలు చుట్టిముట్టినపుడు సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ముందే ఊహించి వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. దీనినే కీడెంచి మేలెంచడం అంటారు. సమస్య నుంచి పారిపోవడం కంటే కూడా దానిని ఎదుర్కొనేలా ఎవరికి వారు సంసిద్ధంగా ఉండాలి.
చదవండి : ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారు
ఓర్పు, నేర్పు...
చాణక్య విధానం ప్రకారం, ఎవరూ కూడా తన ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎప్పుడూ సహనం కోల్పోకూడదు. ఎప్పుడూ సానుకూల కోణంలో ఆలోచించాలి. మరీ ముఖ్యంగా, ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఓపిక పట్టాలి. నేర్పుతో దానిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. పరిస్థితి ఏమైనప్పటికీ, ఆ సమయంలో సహనం కోల్పోకండా మంచి రోజులు వచ్చే వరకు ప్రశాంతంగా వేచి ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది
కుటుంబ సభ్యుల సంరక్షణ...
చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కుటుంబ పెద్ద లేదా కుటుంబ సభ్యుల మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంరక్షిస్తూనే, వారికి ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు దానినుంచి బయట పడేసేందుకు చర్యలు తీసుకోవడం అవసరం.
డబ్బు ఆదాపై దృష్టి పెట్టడం...
ఎల్లప్పుడూ డబ్బును ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సూత్రాన్ని చాణక్యుడు దేశ కోశాగారం కోసం చెప్పినప్పటికీ అది మన ఇంటి కోశానికి కూడా పని చేస్తుంది. పై సూత్రాలను మనసులో పెట్టుకుని వాటి ప్రకారం కుటుంబాన్ని నడిపించుకుంటే మనం కూడా అపర చాణక్యులమవుతాం.
చాణక్యుడిని గొప్ప వ్యూహకర్త అంటారు. ఎందుకంటే భారత రాజకీయాలు, చరిత్ర దిశను మార్చడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారు. తన జీవితకాలంలో ఆయన విధాన సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మానవ స్వభావం, జీవితం గురించి ఆయన చెప్పిన సిద్ధాంతాలు నేటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి