టారిఫ్‌ ప్రభావాలను భారత్‌ తట్టుకోగలదు | Tariffs may not trouble India economic growth | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ ప్రభావాలను భారత్‌ తట్టుకోగలదు

May 22 2025 6:31 AM | Updated on May 22 2025 6:31 AM

Tariffs may not trouble India economic growth

ఎగుమతులపై ఆధారపడడం తక్కువే 

దేశీ వృద్ధి చోదకాలు అండగా నిలుస్తాయ్‌ 

మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా 

న్యూఢిల్లీ: యూఎస్‌ టారిఫ్‌లు, అంతర్జాతీయంగా వాణిజ్య ప్రతికూలతలను భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కోగలదని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. భారత్‌ ఎగుమతులపై తక్కువ ఆధారపడడం.. అదే సమయంలో బలమైన సేవల రంగం అండతో అమెరికా టారిఫ్‌లను అధిగమించగలదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనికితోడు దేశీ వృద్ధి చోదకాలు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది.

 మరే వర్ధమాన దేశంతో పోల్చుకున్నా భారత్‌ మెరుగైన స్థితిలో ఉందని పేర్కొంది. ప్రైవేటు వినియోగం పెంపు, తయారీ సామర్థ్యాల విస్తరణ, మౌలిక సదుపాయలపై వ్యయాలు పెంచడం వంటివి.. అంతర్జాతీయ డిమాండ్‌ బలహీనతలను అధిగమించేందుకు సాయపడతాయని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నాయని.. ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతుగా నిలుస్తుందని వివరించింది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు డిమాండ్‌కు ఊతమిస్తుందని అంచనా వేసింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు భారత్‌ కంటే పాక్‌కే ఎక్కువ నష్టం చేస్తాయని పేర్కొంది.

 ఆ దేశంతో భారత్‌కు పెద్దగా వాణిజ్య సంబంధాలు లేకపోవడాన్ని ప్రస్తావించింది. పైగా భారత్‌లో అధిక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి అంతా ఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉన్నట్టు తెలిపింది. కానీ, రక్షణ రంగంపై అధికంగా వెచి్చంచాల్సి వస్తే అది భారత్‌ ద్రవ్య పరిస్థితులపై ప్రభావం చూపిస్తుందని.. ద్రవ్య స్థిరీకరణ ఆలస్యం కావొచ్చని అభిప్రాయపడింది. భారత ఆటో రంగం మాత్రం అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. అమెరికా టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన అనిశి్చతులతో 2025 సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను మూడీస్‌ 6.7 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఈ నెల మొదట్లో ప్రకటించడం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement