
ముందస్తు అనుమతి లేకుండా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఫ్రాన్స్ విడిచి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌తో చర్చల కోసం అమెరికా వెళ్లాలని దురోవ్ ఇటీవల అధికారులను విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అభ్యర్థనను పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తోసిపుచ్చింది.
పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం, దురోవ్ ప్రతిపాదిత యూఎస్ పర్యటనను ఉటంకిస్తూ ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు ‘ఈ పర్యటనకు కచ్చితంగా వెళ్లాలనేలా ఎలాంటి కారణాలు లేవు’ అని ఇటీవల తీర్పు ఇచ్చారు. 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో అరెస్టయినప్పటి నుంచి దురోవ్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన అడ్డంకులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అరెస్టు చేసినప్పటి నుంచి ఆయనను కఠినమైన చట్టపరమైన నియంత్రణలో ఉంచారు. దురోవ్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన తనపై ఆరు క్రిమినల్ అభియోగాలు మోపారు.
ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
టెలిగ్రామ్ సీఈఓపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్‌ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటివి ఉన్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్‌కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు. ఫ్రాన్స్ అధికారులు 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో దురోవ్‌ను అరెస్టు చేశారు.