
డిజిటల్ కమ్యూనికేషన్ యుగంలో గోప్యత, ఫైల్ షేరింగ్, ఆటోమేషన్ సామర్థ్యాలు వినియోగదారులు తమ ఇష్టపడే మెసేజింగ్ యాప్‌లను ఎంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకునే కారకాలుగా మారాయి. ఇంక్42 (Inc42) రీసెర్చ్ కొత్త తులనాత్మక విశ్లేషణ మూడు ప్రసిద్ధ ప్లాట్ ఫామ్‌లు - స్వదేశీ అరట్టై, వాట్సాప్,టెలిగ్రామ్‌లలో ఏవీ దేనికి ప్రత్యేకమో.. వీటిలో మన అరట్టై ఏ ఫీచర్‌లో గొప్పదో తెలియజేస్తోంది.
అరట్టై
జోహో సంస్థ అరట్టై యాప్‌ను అభివృద్ధి చేసింది. భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ యాప్ ప్రైవసీ-ఫస్ట్ ప్రత్యామ్నాయంగా ఉంది. ఇందులో యూజర్ల డేటాను ఇతరులకు విక్రయించడం ఉండదు. యాప్‌లోని అంతర్నిర్మిత విజిల్ బ్లోయర్ ఫీచర్ నిఘా, డేటా మానిటైజేషన్ గురించి ఆందోళన చెందే వినియోగదారులకు నిశ్చింత కలిగిస్తుంది. ఎన్‌క్రిప్షన్ వాయిస్ కాల్స్‌కే పరిమితం అయినప్పటికీ, దీని పారదర్శకత, స్థానిక మూలాలు గోప్యత-స్పృహ ఉన్న భారతీయ వినియోగదారులకు కచ్చితమైన ఎంపికగా చేస్తాయి.
వాట్సాప్
వాట్సాప్ భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా ఉంది. మెరుగైన ఇంటర్ ఫేస్, వ్యాపార సాధనాలతో కూడిన డీప్ ఇంటిగ్రేషన్‌తో ఆదరణ పొందింది. అయితే మాతృ సంస్థ మెటాతో దాని డేటా-షేరింగ్ పద్ధతులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
టెలిగ్రామ్
టెలిగ్రామ్ దాని భారీ గ్రూప్‌లు / ఛానెల్ సామర్థ్యాలకు, బాట్‌లు, ఆటోమేషన్ కు సపోర్ట్ చేసే ఓపెన్ API కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది. దాని ఎన్ క్రిప్షన్ ప్రోటోకాల్ లు, విజిల్ బ్లోయర్ ఫ్రెండ్లీ వైఖరి ప్రాచుర్యం పొందాయి.
ఫీచర్ | అరట్టై | వాట్సాప్ | టెలిగ్రామ్ |
---|---|---|---|
టెక్స్ట్, మీడియా, డాక్స్ | ✅ సపోర్ట్ | ✅ సపోర్ట్ | ✅ సపోర్ట్ |
ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ | వాయిస్ కాల్స్ మాత్రమే | వాయిస్, వీడియో, టెక్స్ట్ | వాయిస్, వీడియో, టెక్స్ట్ |
గ్రూప్ సైజ్ లిమిట్ | 1,000 మంది | 1,024 మంది | అపరిమితం (ఛానెళ్ల ద్వారా) |
డేటా వినియోగం | డేటా విక్రయం ఉండదు | కొంత డేటాను పంచుకుంటుంది | దాదాపు ప్రైవేటు |
ఫైల్ సైజ్ లిమిట్ | 2 GB వరకు | 2 GB వరకు | 2–4 GB |
బాట్లు/ ఆటోమేషన్ | ❌ లేదు | ✅ బిజినెస్ బాట్స్ | ✅ ఓపెన్ API బాట్ |
సెక్యూరిటీ విజిల్ బ్లోయర్ | ✅ ఉంది | ❌ లేదు | ✅ ఉంది |