
యాపిల్ 2025 సంవత్సరంలో కొత్త ఎయిర్‌పాడ్స్‌ను లాంచ్ చేసే అవకాశం లేదని ప్రముఖ టెక్ విశ్లేషకులు మింగ్-చి కువో తెలిపారు. యాపిల్ ఈ ఏడాదిలో మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రోను విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో కువో ఇలా ప్రకటనలు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసు
ఎయిర్‌పాడ్స్ ప్రో లైనప్‌కు తదుపరి అప్‌డేట్ వర్షన్ 2026 వరకు రాదని కువో అంచనా వేస్తున్నారు. ఎయిర్‌పాడ్స్ లైటర్ వర్షన్ మ్యాక్స్ వర్షన్ 2027లో వస్తుందని చెప్పారు. ఆడియోను మెరుగుపరచడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాలను అందించేందుకు ఉద్దేశించిన బిల్ట్-ఇన్ ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) కెమెరాలు రాబోయే ఎయిర్‌పాడ్ మోడల్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఐఆర్ కెమెరాల అనుసంధానం రోజువారీ వేరబుల్స్‌లో అధునాతన సెన్సింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి యాపిల్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఎయిర్‌పాడ్స్ ప్రో 2 2022లో విడుదలైంది.