
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 271.17 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో.. 82,059.42 వద్ద, నిఫ్టీ 74.35 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో.. 24,945.45 వద్ద నిలిచాయి.
ప్రోటీన్ ఈగోవ్ టెక్నాలజీస్, భారత్ బిజిలీ, ముకంద్, వోడాఫోన్ ఐడియా, గ్లోబల్ ఎడ్యుకేషన్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి. కయా, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), జొడియాక్ ఎనర్జీ, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, ఫుడ్స్ అండ్ ఇన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:41 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు నష్టపోయి 24,991కు చేరింది. సెన్సెక్స్(Sensex) 159 ప్లాయింట్లు దిగజారి 82,164 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.86 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.7 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.52 శాతం ఎగబాకింది.
భారత్–పాకిస్థాన్ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్‌లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంటుంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)