
ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోసస్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సంస్థ సీఈఓ ఫాబ్రిసియో బ్లోయిసి తెలిపారు. ఇప్పటికే భారతదేశ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లో 9 బిలియన్ డాలర్ల(సుమారు రూ.75,960 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో మరింత పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందుందని తెలిపారు.
ఇదీ చదవండి: భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలు
భారత టెక్ రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని, వచ్చే 20 నుంచి 30 ఏళ్ల పాటు భారత ఆశయాలకు మద్దతు ఇవ్వాలని ప్రోసస్ భావిస్తున్నట్లు బ్లోయిసీ చెప్పారు. సృజనాత్మకత, వ్యవస్థాపకత కీలకంగా కంపెనీ పెట్టుబడి వ్యూహం ఉంటుందని తెలిపారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకోసిస్టమ్‌లో భారతీయ స్టార్టప్‌లు వృద్ధి చెందేందుకు కంపెనీ సహకరిస్తుందని పేర్కొన్నారు.