
వంటల్లో కొబ్బరిని జోడిస్తే.. ఆ రుచే అదుర్స్. పైగా అందులోని పోషకాలు, ప్రోటీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి హెల్దీ కోకోనట్‌తో మరింత హెల్దీగా వెరైటీలు చేసుకుందామా?
కొబ్బరి చాక్లెట్
కావలసినవి: చిక్కటిపాలు – కప్పు; పంచదార – అర కప్పు; కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – కొద్దిగా; చాక్లెట్ చిప్స్ – కప్పు;
తయారీ: ముందుగా కడాయిలో పాలు, పంచదార వేసుకుని, చిన్న మంట మీద బాగా కాగనివ్వాలి. అనంతరం అందులో కొబ్బరి తురుము వేసుకుని దగ్గర పడేవరకూ అలానే గరిటెతో తిప్పుతూ ఉడి కించుకోవాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. ఇప్పుడు నెయ్యి చేతులకు రాసుకుని ఈ మిశ్రమంతో చిన్నచిన్న బాల్స్ లేదా బైట్స్‌లా చేత్తో ఒత్తుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ చిప్స్‌ని ఓవెన్‌లో కరిగించి.. కొబ్బరి బైట్స్‌ని అందులో ముంచి బాగా పట్టించాలి. అనంతరం అవి గాలికి ఆరిన తర్వాత సర్వ్ చేసుకోవాలి.
కొబ్బరి పులిహోర
కావలసినవి: బియ్యం – ఒక కప్పు (అన్నం పొడిపొడిగా ఉడికించుకోవాలి); పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు – ఒక టీస్పూన్ చొప్పున; జీలకర్ర – అర టీస్పూన్; ఎండుమిర్చి – 2–3 (తుంచినవి); పచ్చిమిర్చి – 2–3 (మధ్యలోకి చీల్చినవి); కరివేపాకు– 2 రెబ్బలు; ఇంగువ – చిటికెడు; పసుపు – అర టీస్పూన్; నిమ్మరసం – 1–2 టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా); నూనె – 2–3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత
చదవండి: ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారు
తయారీ: ముందుగా బియ్యాన్ని బాగా కడిగి,పొడిపొడిగా ఉండేలా అన్నం వండుకోవాలి. ఇలా వండిన అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్‌లో వేసి చల్లారనివ్వాలి. దీనికి పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నూనెలో శనగపప్పు, మినప్పప్పు వేసి కొద్దిగా రంగు మారగానే ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి గరిటెతో తిప్పుతూ, బాగా వేయించాలి. ఇప్పుడు ఈ తాలింపులో కొబ్బరి తురుము వేసి సుమారు 1–2 నిమిషాల పాటు వేయించాలి. కొబ్బరితురుము పెద్దగా రంగు మారకుండా చూసుకోండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అనంతరం పల్లీలు కలుపుకుని సర్వ్ చేసుకోవచ్చు.
కొబ్బరి ఐస్‌క్రీమ్
కావలసినవి: కొబ్బరి తురుము – కప్పు; కొబ్బరిపాలు – 2 కప్పులు; కండెన్సెడ్ మిల్క్ – ము΄్పావు కప్పు; ఫ్రెష్ క్రీమ్ / హెవీ క్రీమ్ – ఒక కప్పు (బాగా చల్లగా ఉండాలి); పంచదార – పావు కప్పు (రుచిని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు); యాలకుల పొడి – అర టీస్పూన్;
తయారీ: ముందుగా ఒక మిక్సీ జార్‌లో కొబ్బరి తురుమును వేసి, ΄ావు కప్పు కొబ్బరి ΄ాలు కలిపి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక పెద్ద బౌల్‌లో ఫ్రెష్ క్రీమ్ లేదా హెవీ క్రీమ్ తీసుకొని, ఎలక్ట్రిక్ బీటర్‌తో నురుగు వచ్చే వరకు బీట్ చేయాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న క్రీమ్‌లో కండెన్స్‌డ్ మిల్క్, మిగిలిన కొబ్బరిపాలు, యాలకుల ΄పొడి వేసి కలపాలి. చివరగా ముందే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్‌ను ఈ మిశ్రమంలో వేసి, అన్నీ బాగా కలిసేలా ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పోసి, మూతపెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రీజర్‌లో కనీసం 8 గంటలు లేదా రాత్రంతా పూర్తిగా గడ్డకట్టే వరకు ఉంచాలి.